మామూలుగా అరటిపండును తిన్న తర్వాత తొక్క ఎందుకు పనికిరాదు అని విసిరేస్తూ ఉంటాం. ఇంకొందరు వాటితో వర్మీ కంపోస్ట్ వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అరటిపండు లో మాత్రమే కాకుండా అరటి పండ్ల తొక్కల్లో కూడా శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయట. అరటిపండు తొక్కలో ఉండే విటమిన్ బి6 ట్రిప్టోఫాన్ డిప్రెషన్ ను తగ్గిస్తుంది. మూడ్ ను కూడా సరిచేసే సామర్ధ్యం ఉంటుందట. అలాగే కొవ్వును తగ్గిస్తుందట. అరటి పండులో మెండుగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని చెబుతున్నారు.
గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయట. అదేవిధంగా అరటిపళ్ళ తొక్కను కంటిపై పెట్టుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు మచ్చలు తగ్గుతాయట. కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అరటిపండు తొక్కను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చట. ఒక వారం రోజులపాటు నోటి పళ్ళ పై ఈ తొక్కను ఒక నిమిషం పాటు రాయడం వల్ల పళ్ళు మిల మిల మెరుస్తాయని మార్పును మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు. ఈ పండు తొక్కలో మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
ఇవి పళ్ళపై ఉండే ఎనామిల్ తొలగిపోకుండా చేసి పళ్ళు నిలవడానికి కారణం అవుతాయి. మొటిమలు అరటితొక్కను ముఖంపై ఒకవారం పాటు గట్టిగా రాస్తే మొటిమలు కూడా మాయం అవుతాయట. చర్మంపై మంట, మచ్చలు ఏవైనా ఉన్నా కూడా పోతాయని చెబుతున్నారు. ముడతలు రాకుండా అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అరటితొక్కలో చర్మాన్ని ముడతలు పడనీయకుండా చేసే పోషకాలు ఉండడంతో పాటు చర్మం కూడా ముడతలు పడకుండా ఉంటుందట. అరటి తొక్కలో ఫినొలిక్స్, ఫ్లావనాయిడ్స్, టానిన్లు, కారటెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని యూవీ రేడియేషన్ ను రక్షిస్తుందట. ఇళ్లల్లో అరటితొక్కను బట్టలపై మరకలు తొలగించడానికి, ఇంకా వంట పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. చర్మంపై దోమ కుడితే ఆ భాగంపైన అరటితొక్కతో రాయాలి. అలా చేస్తే అక్కడ ఉన్న మంట తగ్గుతుందట. అయితే అరటి తొక్కను కొన్ని సందర్భాల్లో మాత్రమే నేరుగా తినాలి. వీటిని ఫ్రై చేసుకొని, మిక్సిలో వేసుకొని బజ్జీలుగా ఇలా రకరకాలుగా తినవచ్చట.