Site icon HashtagU Telugu

Health Benefits: ఎర్ర తోటకూర వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే శాఖవ్వాల్సిందే?

Mixcollage 26 Dec 2023 06 11 Pm 8460

Mixcollage 26 Dec 2023 06 11 Pm 8460

ఆకుకూరల వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు కూడా తాజా ఆకుకూరలు,కాయగూరలను డైట్లో చేర్చుకోమని వాటిని ఫాలో అవ్వమని తరచూ చెబుతూ ఉంటారు. అయితే మనకు ఎక్కువగా ఆకుకూరలు పచ్చగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటితో పోల్చుకుంటే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు వైద్యులు. ఈ ఎర్రతోట కూరలో విటమిన్ ఏ, సి, బి, కాల్షియం పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్, ఫాస్ఫరస్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

వారంలో రెండు సార్లు తోటకూరతో కూర, పప్పు లాంటివి చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరలో క్యాలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే ఆకు కూరలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన తొందరగా ఆకలి కూడా వేయదు. తోటకూర తినడం వలన గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ ఆకుకూరను ఎక్కువగా తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ కె ఎక్కువగా ఉండడం వలన ఎముకలు గట్టిగా ఉంటాయి.

అలాగే రక్తం గడ్డ కట్టడంలో కీలకపాత్రను పోషిస్తుంది. అలాగే తోటకూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనివలన కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని లాభాలు ఉన్న ఎర్ర తోటకూరను వారానికి రెండు సార్లు అయినా కచ్చితంగా తినాలి. ఎర్ర తోటకూర తినడం వలన జీవక్రియ రేటు పెరిగి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడమే కాకుండా ముడతలు, మొటిమలు వంటివి లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, జియోక్సంతిన్, లూటిన్ ఉన్నాయి. వీటిలో ఫ్లెవనాయిడ్ పాలీఫెలోనిక్ యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్మాని కాపాడుతాయి.