Site icon HashtagU Telugu

Ashwagandha: అశ్వగంధపొడిని పాలల్లో కలిపి తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 14 Feb 2024 06 10 Pm 8434

Mixcollage 14 Feb 2024 06 10 Pm 8434

అశ్వగంధపొడి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. పురాతన కాలం నుంచే అశ్వగంధ ఎన్నో రకాల మెడిసిన్స్ కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ అశ్వగంధ పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి అశ్వగంధ పొడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అశ్వగంధపొడిని పాలల్లో కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే నిద్ర పట్టడం లేదు అనే మాట ఉండదు. ఎందుకంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు అశ్వగంధని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. గోరువెచ్చని పాలల్లో అశ్వగంధపొడి కలుపుకుని తాగడం వల్ల కఫా, వాత దోషాలు పరిహారం అవ్వడమే కాక తేలికగా జీర్ణం అవుతాయి. మీరు పాలతో అశ్వగంధ ని కలిపి తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి అది మీకు సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. గోరువెచ్చని మరిగించిన పాలతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. రెండు గ్రాముల అశ్వగంధపోడిని 125 మిల్లీ గ్రాముల త్రికాటు పొడితో కలపాలి.

త్రికాటులో మూడు ఘాటైన మూలికలు ఉంటాయి. అవి ఎండిన అల్లం అంటే సొంటి, నల్ల మిరియాలు మరియు పొడుగు మిరియాలు వీటి సమ్మేళనాన్ని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. సాంప్రదాయ ఆయుర్వేద నివారణలో ఒక గ్రామ తెల్ల మద్ది ఒక గ్రామ్ నల్లేరు, రెండు గ్రాముల అశ్వగంధ పొడిని రోజుకు రెండుసార్లు పాల వాహకంగా తీసుకోవాలి. సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో అశ్వగంధ పాలు అశ్వగంధపొడి పాలు కలిపి టీ తయారు చేసేందుకు ముందుగా ఒక పాన్ లో సగం గ్లాసు నీరు , సగం క్లాస్ పాలు పోసి మరిగించాలి. దానిలో ఒక గ్రామం అశ్వగంధ పొడిని వేయాలి. అది సగానికి తగ్గినప్పుడు చల్లబరిచి చక్కెరను కలిపి తీసుకోవాలి. పాలతో అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మన శరీర జవసత్వాల పునరుద్ధరణకు ఔషధంగా పనిచేస్తుంది. ఒక కప్పు వెచ్చని పాలలో రెండు గ్రామాల అశ్వగంధ కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.