Site icon HashtagU Telugu

Winter: చలికాలంలో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. రోగాలన్ని మాయం అవ్వాల్సిందే!

Winter

Winter

చలికాలంలో చాలా రకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలి జ్వరం ఒళ్ళు నొప్పులు దగ్గు జలుబు వంటి వాటితో పాటు అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో చలికాలంలో వచ్చే వ్యాధులన్నింటికీ ఒక జ్యూస్ అమృతంలా పనిచేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి దానిని ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఆ జ్యూస్ మరేదో కాదు ఉసిరి రసం. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుందట. ఇది రోజంతా మనల్ని ఎనర్జిటిక్గా ఫిట్ గా గా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.

ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుంచి మనలను రక్షిస్తాయి. ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి ఉసిరి మనలను రక్షిస్తుందని చెబుతున్నారు. అలాగే ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుందట. ఉసిరిలో కెరోటిన్ ఉంటుంది. ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది.

రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందట. కంటిశుక్లం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఉసిరి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందమైన చర్మం కావాలంటే ఉసిరిని తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుందట. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రసం తాగితే అనారోగ్య సమస్యలు ధరి చేరవని చెబుతున్నారు. కాగా.ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మంచి శరీర ఆకృతిని పొందవచ్చట. ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఇది కొవ్వును కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.