Kiwi : ప్రతిరోజు కివి పండు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

కీవీ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పు

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 09:30 PM IST

కీవీ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

అలాగే కివిలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తా. ప్రతి రోజూ కివి తినడం వల్ల సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. కివి బరువును నియంత్రించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఈ పండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కివీని తప్పకుండా తినాలి. కివీఫ్రూట్‌లోని డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ పండు పొట్టను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఒక వారం పాటు కివి తింటే మీ లిపిడ్ ప్రొఫైల్ సాధారణ స్థాయికి తీసుకువస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కివి తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, కివి తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కివిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కివిలోని పోషకాలు మచ్చలు, మొటిమల సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఎలక్ట్రోలైట్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.