Site icon HashtagU Telugu

Pistachios Benefits: ప్రతిరోజు 12 పిస్తాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 04 Jul 2024 08 48 Pm 9674

Mixcollage 04 Jul 2024 08 48 Pm 9674

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైనా పిస్తా గురించి మనందరికీ తెలిసిందే. పిస్తా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలను పొందవచ్చు. పిస్తాను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయట. మరి ముఖ్యంగా ప్రతిరోజు 12 పిస్తాలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు. మరి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిస్తాలలో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.

ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇది బ్రెయిన్ పనితీరుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపడేలా చేస్తుంది. పిస్తాల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ మన శరీర పని తీరుకు ప్రోత్సహిస్తాయి. అలాగే పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మోనో శాచురేటెడ్‌ కొవ్వులు, పాలీ అన్‌ శాచ్యురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. వీటిలో క్యాలరీల మోతాదు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వంటివి మీకు లభిస్తాయి.

అలాగే ఇవి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తాయి. దీంతో బరువు పెరగరు. క్యాలరీలు కూడా తక్కువగా తీసుకుంటారు. కాగా పిస్తాలు తీసుకోవడం వల్ల ఇందులో గ్లైసామిక్ సూచి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెరను హఠాత్తుగా పెరగనివ్వవు. డయాబెటిస్ తో బాధపడేవారు పిస్తాలు స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు. అలాగే పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో మంట సమస్యను తగ్గిస్తాయి. అదేవిదంగా ప్రాణాంతక వ్యాధులను దరిచేరకుండా ఆర్థరైటిస్ గుండె సమస్యల నుంచి కాపాడతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మెరుగైన బ్రెయిన్ పని తీరుకు సహాయపడతాయి.