Site icon HashtagU Telugu

Health Benefits : భరించలేని విధంగా ఉన్న పైల్స్ కూడా ఈ ఒక్క చిట్కాతో మాయం అవ్వాల్సిందే?

Mixcollage 15 Jan 2024 06 38 Pm 119

Mixcollage 15 Jan 2024 06 38 Pm 119

ఫైల్స్ సమస్య.. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పైల్స్ నొప్పి వర్ణనాతీతం. మలవిసర్జన చేసే సమయంలో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అందుకే ఈ ఫైల్స్ సమస్యను తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొందరు మొలలు ముదిరిపోయి తట్టుకోలేక ఆపరేషన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రమే హోమ్ రెమిడీలను ఫాలో అయ్యి ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. మీరు కూడా అలా ఫైల్స్ సమస్యతో బాధపడుతుంటే సింపుల్ చిట్కాలతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పైల్స్ వ్యాధి కొంత మందికి ఎన్ని మందులు వాడినా తగ్గదు. అలాంటప్పుడు బాగా పండిన అరటి పండు లేదా పచ్చి అరటి పండు కాకుండా మధ్యస్తంగా ఉన్న అరటి పండును తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటి పండు ముక్కలో పెట్టుకోవాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినాలి. ఇది తిన్న అరగంట ఏమి తాగకూడదు, తినకూడదు. అలా తినలేము అనుకున్న వాళ్ళు పచ్చ కర్పూరం పొడి చేసుకుని అరటి పండు ముక్కలపై జల్లుకుని తినేయాలి. అరటి పండు మొత్తం తినేయవచ్చు. ఇది రోజుకి ఒక్క సారి మాత్రమే తీసుకోవాలి. ఇలా వరుసగా మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య పూర్తిగా తగ్గుతుంది.

పైల్స్ ఎక్కువగా బాధిస్తున్న వారు 5 రోజుల పాటు తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న పైల్స్ వ్యాధి ఈ ఒక్క చిట్కాతో ఈజీగా తగ్గిపోతుంది. ఈ చిట్కా టై చేసినపుడు బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. కూరలలో కూడా నూనె చాలా తక్కువగా వేసుకోవాలి. కారం కూడా చాలా తక్కువగా తినాలి. కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన పైల్స్ వ్యాధి తగ్గదు. పైల్స్ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు కారం, మసాలాలు తినడం మానేయాలి. పైల్స్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తినవచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న పైల్స్ వ్యాధిని తక్కువ ఖర్చుతో, ఈజీగా ఇంట్లోనే ఈ ఒక్క చిట్కాతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. పైల్స్ వ్యాధి ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎంత బాగా తాగితే అంత త్వరగా పైల్స్ సమస్య తగ్గిపోతుంది.