Site icon HashtagU Telugu

Health Benefits: నిమ్మకాయ, జీరాతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టండిలా?

Kk

Kk

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంచెం కూడా బరువు తగ్గలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇక మీదట అలా దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే మేము చెప్పబోయే రెమెడీని పాటిస్తే చాలు తప్పకుండా బరువు తగ్గడం ఖాయం. అందుకోసం నిమ్మకాయ జీరా ఉపయోగించాలి. మరి ఈ రెండింటితో అధిక బరువును తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జీరాలో వెయిట్ లాస్ తగ్గించే పవర్ దాగి ఉంది. బెల్లీ ఫ్యాట్ ని 20 రోజులలోపే తగ్గించుకోవడానికి జీరా చక్కటి పరిష్కారం. బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాదు.. శరీర బరువు మొత్తం ఈజీగా తగ్గిపోతుంది. ఈజీగా క్యాలరీలు కరిగించడానికి, మెటబాలిజం పెంచడానికి, జీర్ణక్రియ రేట్ సజావుగా ఉండటానికి జీరా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ ని అరికడుతుంది. మెమరీ పవర్ ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనీమియాతో పోరాడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే సత్తా కూడా జీరాలో ఉంది.శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉన్నాయి. దీంతో అధిక బ‌రువు ఉన్న‌వారు నిమ్మర‌సం తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది. కేవలం బరువు తగ్గడమే కాదు.

గుండె సంబంధ స‌మ‌స్యల‌ను కూడా దూరం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.అయితే ఒక గ్లాసున్న‌ర నీళ్లు తీసుకుని మ‌రిగించాలి. ఇందులో లెమ‌న్ తీసిన నిమ్మ తొక్క‌లు ముక్క‌లుగా కోసి వేయాలి. ఇలా బాగా మ‌రిగించి చ‌ల్లారిన త‌ర్వాత ఫిల్ట‌ర్ చేసి స్పూన్ తేని వేసి క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌రిగ‌డుపున తాగాలి. లేదా సాయంత్ర తినేకంటే అర‌గంట ముందుగాని లేదా తిన్న‌అర‌గంట త‌ర్వాత తాగాలి. ఇలా చేస్తే జీర్ణ‌క్రియ మెరుగుప‌డి బాడ్ కొలెస్ట్రాల్ పెర‌గ‌కుండా చేస్తుంది. అలాగే జీరా, నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగినా అధిక బ‌రువును నియంత్రించ‌వ‌చ్చు.