Site icon HashtagU Telugu

Health Benefits: అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను ఉపయోగించాల్సిందే?

Mixcollage 01 Jan 2024 02 58 Pm 3115

Mixcollage 01 Jan 2024 02 58 Pm 3115

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అధిక బరువు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ అధిక బరువు సమస్య కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కూర్చోవాలి అన్న నిలబడాలి అన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ బరువు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు.

మరి ఈ అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. జాబ్స్ చేసేవారు ఎక్కువగా కూర్చుని పని చేసేవాళ్లు ,ఉదయం లేస్తారు. టిఫిన్ టీలు చేస్తారు. తింటారు. ఆఫీస్ కి వెళ్ళిపోతారు. వెళ్లి అక్కడ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. అయితే మనం ఎంత తిన్నామో అన్నది. ముఖ్యం కాదు, ఏం తిన్న దానికి మూడింతలు పనిచేయాలి. మనం పని చేస్తే మన శరీరం నుంచి చెమటలు, కారిపోవాలి. అలా చెమటలు రావడం వలన, అధిక కొవ్వులు కరిగిపోతాయి. అసలు ఎలాంటి నియమాలు పాటిస్తే ఈ అధిక బరువు తగ్గుతారు. 30 సంవత్సరాలు దాటిన వారు ఉదయం లేవగానే, 45 నిమిషాల వరకు వాకింగ్ కచ్చితంగా, చేయాలి. తరువాత గోరువెచ్చని నీటిని ఒక లీటర్ తీసుకోవాలి.

తర్వాత కొన్ని రకాల మొలకలను, ఒక కప్పు తీసుకోవాలి. ఒక గంట తర్వాత క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, టొమాటో వీటన్నింటిని కలిపి జ్యూస్ లాగా చేసుకొని త్రాగాలి. ఇక రెండు మూడు గంటల తర్వాత భోజనం, భోజనంలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత 4, 5 గంటల సమయంలో ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మళ్లీ రెండు గంటల తర్వాత ఆరు ఏడు గంటలలో భోజనం కానీ చపాతి కానీ తొందరగా ముగించాలి. ఇలా ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా అధిక బరువు తగ్గుతారు. ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవారు ఎక్సైజ్ లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ఎంత అధిక బరువైన ఈజీగా తగ్గిపోవాల్సిందే అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.