ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాళ్ళు,నడుము, వెన్ను, కీళ్ళ నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇలా శరీరంలో అనేక రకాల అవయవాలు నొప్పించడానికి అనేక రకాల కారణాలు ఉండగా వాటిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒకటి కావచ్చు. ఆహారపు అలవాట్లలో వచ్చిన విపరీతమైన మార్పులు కూడా మన శరీరంలో అనేక రకాల మార్పులకు, నొప్పులు వంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. చాలామంది ఈ నొప్పులను తగ్గించుకోవడానికి రకరకాల ఆయింట్మెంట్లు టాబ్లెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటివల్ల త్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ మళ్లీ ఆ నొప్పి పునరావృతం అవుతూ ఉంటుంది.
అటువంటప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే చాలు ఆ నొప్పుల సమస్యల నుంచి బిజీగా బయటపడవచ్చు. అయితే ఈ నొప్పులను తగ్గించడంలో జాజికాయ ఎంతో బాగా పనిచేస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ఒక రెండు స్పూన్ల జాజికాయ పొడి, ఒక స్పూన్ పసుపు అది అప్లై చేయడానికి వీలుగా ఆవనూనె కలిపి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నీటిలోని గుణాల వల్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. అలాగే నిద్ర లేమి, డిప్రెషన్ తో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు పాలలో ఒక స్పూను జాజికాయ పొడి, అర స్పూన్ పసుపు కలిగి తాగడం వల్ల నిద్రలేమి సమస్య నివారించబడుతుంది.
జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య సంకేతాలు మరియు క్యాన్స్ర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి రక్షించడంలో సహాయ పడుతుంది. అలాగే జాజికాయ నూనెను అనేక దంత ఉత్పత్తులలో ఉపయోగస్తారు. ఈ మసాలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉంది. ఇది పంటి వ్యాధి మరియు దుర్వాసనకు కారణం అయ్యే నోటిలోని వ్యాధికారిక క్రిములకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా నిరూపించబడింది. అలాగే జాజికాయ మగ వారిలో యాంటీడిప్రెసెంట్గా పని చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. అయితే పురుషుల్లో లైంగిక శక్తిని పెంచడానికి, శీఘ్ర స్ఖలనాన్ని నివారించడానికి ఉపయోగించబడింది. జాజికాయ నొప్పిని తగ్గించడం, అజీర్తిని ఉపశమనం చేయడం, మెదడు పనితీరును బలోపేతం చేయడం మంచిది. అయితే లుకేమియాను నివారించడం రక్త ప్రసరణను మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కల్గి ఉన్నట్లు తెలిసింది.