Site icon HashtagU Telugu

Banana: ప్రతిరోజు ఒక అరటిపండు తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్!

Banana

Banana

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. కాగా మనకు ఈ అరటిపండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. కొందరికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతిరోజు వీటిని తింటూ ఉంటారు. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు.

ఈ అరటి పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండల్లో అరటి పండు ఒకటి. అరటి కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి గుండెను సేఫ్ గా ఉంచుతుంది. ఒక మీడియం సైజ్ అరటిపండు మన రోజువారీ పొటాషియం అవసరంలో 10 శాతం అందిస్తుందట. ప్రతిరోజు అరటి పండ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

పచ్చిగా ఉండే అరటి పండ్లలో 30 గ్రాములు ఉంటే, పండిన అరటిలో అయితే ఈ విలువ 60గా ఉంటుంది. దీన్ని తిన్నంత మాత్రాన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోవు. మధుమేహులు అరటి పండ్లను ఎలాంటి భయాలు లేకుండా తినవచ్చు. అయితే బాగా పండిన అరటిపండ్లను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. అలాగే అరటిపండ్లలో డోపామైన్, కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు కాదు ఈ పండ్లలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్స్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. అలాగే కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయట.

అతిగా ఆకలి అయ్యే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.అరటి పండులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, నియాసిన్, మెగ్నీషియం, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6 వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మన శరీరం సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అరటిపండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య ఉన్నవారికి సహాయపడుతుందట. రోజుకు ఒక అరటిపండును తింటే రక్తహీనత సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత అలసట, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.