Site icon HashtagU Telugu

Jeera For Health: జీరా కలిపిన నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయ్?

Jeera Water

Jeera Water

మనం ముఖ్యం వంటల్లో వాడే జీలకర్రలో ఎన్నో రకాల ఆక్సిడెంట్లు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఉదయం పడగడుపున జీరా వాటర్ ను తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా బరువు తగ్గాలని అనుకున్నవారు, బరువు తగ్గడం కోసం అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు పెద్దగా కష్టపడకుండా ఒకవైపు వ్యాయామం చేస్తూనే పుష్కలమైన ఆహారం తీసుకుంటూ పరగడుపున జీరా నీళ్లను తాగితే తొందరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా జీలకర్రలో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా అనేక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. జీలకర్ర కలిపిన నీటిని ఉదయం పరిగడుపున తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే జీరా వాటర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఈ జీరా వాటర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మరి ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి ఇది ఒక దివ్య ఔషదంలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు.

అలాగే జీరా వాటర్ గ్యాస్ట్రిక్, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే వ్యాయామంతో పాటుగా ప్రతిరోజూ జీరా వాటర్ ను తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. మరి ఈ జీరా వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలంటే… టీస్పూన్ జీలకర్రలో సుమారు 20 నుంచి 21 గ్రాముల జీలకర్ర ఉంటుంది. దీనిలో కేవలం 8 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి జీలకర్ర వాటర్ ను తాగడం వల్ల మీ శరీరంలోకి అదనపు కొవ్వులు ప్రవేశించే అవకాశమే ఉండదు. అలాగే జీలకర్రలో ఆల్డిహైడ్, థైమోల్, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించే కారకాలుగా పనిచేస్తాయి. జీరా వాటర్ బరువున తగ్గించడంతో పాటుగా శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. జీలకర్రలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.