Neera: వామ్మో నీరా తో ఎక్కువగా అన్ని రకాల ప్రయోజనాలా?

నీరా.. తాటి,ఈత,ఖర్జూర చెట్ల నుండి తీసే ఈ నీరా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ నీరా లాంటివి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయని చెప్ప

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 08:50 PM IST

నీరా.. తాటి,ఈత,ఖర్జూర చెట్ల నుండి తీసే ఈ నీరా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ నీరా లాంటివి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయని చెప్పవచ్చు. కాలం మారిపోవడంతో వీటిలో కూడా కల్తి వస్తున్నాయి. కేవలం మారుమూల ప్రాంతాల్లో మాత్రమే మనకు నీరా దొరుకుతూ ఉంటుంది. ఈ కొంచెం తియ్యగా ఉండి కొబ్బరి నీరు తాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పులియబడితే కళ్ళుగా మారుతుంది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అందుకే నీరా తాగేవారు ఎండ తగలక ముందే దీనిని సేకరిస్తూ ఉంటారు. కల్లులో మత్తును ఇచ్చే లక్షణాలు ఉంటాయి. కానీ నీరాలో అలాంటి లక్షణాలేవీ ఉండవు. నీరాలో ఆల్కహాల్ కంటెంట్ శాతం జీరో. నీరాను ఎవరైనా తాగవచ్చు.

పెద్దలు పిల్లలు అనే తేడాలేం అవసరం లేదు. కొబ్బరి నీటిలా తాగేయవచ్చు. నీరాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నీరా ఎక్కువగా తాటి, ఈత చెట్లు ఉన్న దగ్గరే దొరుకుతుంది. సిటీలో ఉండే వారికి ఇది అందుబాటులో ఉండదు. మరి ఈ నీరా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీరా విటమిన్లు, ఖనిజాలు నీరాలో పుష్కలంగా ఉంటాయి. నీరాలో ఉండే గ్లుటామిక్ యాసిడ్ అనే అమైనో ఆమ్లం సహా ఇతర పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

నీరాలోని పోషకాలు రెసిస్టెంట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను పెంచుతాయి. ఇది అనారోగ్యాలపై పోరాడేలా చేస్తుంది. నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇతర పానీయాలతో పోలిస్తే నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. నీరా ని మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిరభ్యంతరంగా తాగొచ్చు. నీరాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణకు ఇది చాలా కీలకం. పొటాషియం వాసోడైలేటర్ గా పనిచేస్తుంది. ఇది రక్త నాళాల నుండి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ధమనుల ద్వారా రక్తం సాఫీగా వెళ్లేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం హృదయనాళ వ్యవస్థ ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

ఇవి వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో నీరా సహాయపడుతుంది. నీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు, నల్ల మచ్చలు, వృద్ధాప్య సంకేతాల వంటి వివిధ చర్మ సమస్యలు దరిచేరవు. నీరాలో విటమిన్ సి పుష్కలంగా ఉంంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని చాలా మంచిది. అలాగే ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.