మామూలుగా తామర పువ్వు అనగానే చాలామంది ఆధ్యాత్మికంగా మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తామర పువ్వు కేవలం ఆధ్యాత్మికంగా పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక తామర గింజలతో చేసిన మాలలను జపాలకి వాడుతారు. పైగా ఈ మధ్య తామర గింజలతో చేసిన స్నాక్స్ ని అల్పాహారంగా తీసుకునే పద్ధతి ఎక్కువగా చూస్తున్నాము. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు ఊబకాయం కూడా త్వరగా తగ్గుతుందట. కేవలం తామర గింజల్లోనే కాదు తామర పువ్వుల్లో కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తామర పువ్వులను అనాదిగా పలు రకాల నాటువైద్యాలలో ఉపయోగించేవారు. వీటిలో పుష్కలంగా లభించి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాల కారణంగా ఇవి చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా వాడవచ్చు. అలాగే ఈ పువ్వులలో మెగ్నీషియం, క్యాల్షియం , ఐరన్ , ఫాస్ఫరస్ , క్లోరిన్ , పొటాషియం ఇలా ఎన్నో ఖనిజాలు లభ్యమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో గ్రీన్ టీ చాలా ఫ్లేవర్స్ లో దొరుకుతున్నాయి. అలాగే ఫ్లవర్ టీ లో కూడా ఎన్నో రకాల ఈజీగా దొరుకుతున్నాయి. వీటిలో లోటస్ ఫ్లేవర్ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తప్పించుకోవచ్చు.
ఇది మరీ కాస్ట్లీ గా ఉంటుంది అనుకునే వారికి ఇంటి వద్దనే లోటస్ టీ చేసుకునే వసతి ఉంది. మనకు దొరికే తామర పువ్వులను ఫ్రెష్ గా అయిన వాడొచ్చు లేదు తామర రేకులను జాగ్రత్తగా ఎండలో ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ ని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీటిలో ఒక రెండు తామర రెక్కలను వేసి మూత పెట్టి పక్కన ఉంచాలి. కాసేపటి తర్వాత దాన్ని వడకట్టుకొని గోరువెచ్చగా సేవించాలి. ఇలా తామర టీ తీసుకోవడం వల్ల చికాకు, తలనొప్పి, స్ట్రెస్ ,జ్వరం వంటి సమస్యలు తగ్గడంతో పాటు మన శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక తత్వాలు అందుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజు లోటస్ టీ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో పాటు విపరీతమైన నొప్పులతో బాధపడే వారికి లోటస్ టీ రిలాక్సేషన్ కలిగిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది కాబట్టి డయాబెటిస్ పేషన్స్ కూడా ఈ టీ తాగవచ్చు. అయితే ఈ టీ ను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,హైపోగ్లైసీమియా ఉన్నవారు, కొన్ని రకాల ఎలర్జీస్ కలిగిన వాళ్లు తీసుకోకూడదు.