ఇటీవల కాలంలో చాలా మంది టీ కాఫీ కి బదులుగా గ్రీన్ టీ బ్లాక్ టీ వంటివి తాగడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడు తాగే టీ కాఫీ లేక బదులుగా కొంచెం ప్రత్యామ్నాయంగా అలవాట్లను చేసుకుంటున్నారు. కాగా బ్లాక్ కాఫీ మంచి సువాసన రుచిని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులు దరి చేరవు అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ కాఫీ శారీరక పనితీరును మెరుగుపరుస్తుందట.
ఇందులోని కెఫిన్ స్థాయి నాడీ వ్యవస్థను ప్రేరేపించడంతో పాటు కాలేయంలో కొవ్వు ముప్పును తగ్గిస్తుందట. వ్యాయామం సమయంలో ఎక్కువ సేపు శక్తిని అందించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీర పనితీరు 11 నుంచి 12 శాతం పెరుగుతుందట. అలాగే బ్లాక్ కాఫీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కెఫిన్ మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్మ్సిటర్ల స్థాయిలను పెంచడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట. అంతే కాకుండా బ్లాక్ కాఫీని తరచుగా తాగడం వల్ల డిప్రెషన్ ప్రమాదం తగ్గి, రోజంతా ఉల్లాసంగా, ఆనందంగా ఉండవచ్చు అని చెబుతున్నారు.
అలాగే బ్లాక్ కాఫీ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో సహాయపడుతుందట. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి జీవక్రియ రేటును పెంచడంతో పాటు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ తరచుగా తాగడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందట. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందట. బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును నిరోధిచడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధుల నుంచి ముందస్తు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.