Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మామూలుగా చాలా మందికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే వారికీ మాత్రేమే కాకుండా బయట ఆఫీస్ వర్క్,కూలి ప

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 08:53 PM IST

మామూలుగా చాలా మందికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే వారికీ మాత్రేమే కాకుండా బయట ఆఫీస్ వర్క్,కూలి పని చేసేవారికీ కూడా మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకునే అలవాటు ఉంటుంది. మరి నిజానికి మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోవచ్చా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల నిద్ర, అలసట సమస్యలు సర్వసాధారణం.

తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుందని కూడా చెబుతారు. దీనివల్ల ఎక్కువగా నిద్రపోతారు. ఇది సాధారణ ప్రక్రియ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల బ్రెయిన్​ పవర్‌కు న్యాప్​బాగా పనిచేస్తుంది. ఈ న్యాప్​ వల్ల చురుకుదనం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉంటుంది. అంతేకాదు కాసేపు తీసే కునుకు క్రియేటివిటీని పెంచుతుంది. అయితే, ఇది ఒక అలవాటుగా మారితే మాత్రం అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. మధ్యాహ్నం వేళ నిద్రపోయే అలవాటు దీర్ఘకాలంలో చాలా నష్టాలను కలిగిస్తుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోయే పెద్దలకు మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పగటిపూట నిద్రపోవడం అంటే మీకు రాత్రిపూట తగినంత నిద్ర రావడం కష్టంగా మారుతుంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను పెంచుతుంది. కాబట్టి, రాత్రి తగినంత నిద్ర పొయేలా చూసుకోండి. పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల నిద్ర చక్రానికి భంగం కలుగుతుంది. అందుకే పగటిపూట కాస్త కునుకు తీస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి పగటి పూట 20-30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. లేదంటే నష్టం జరగవచ్చు.