Site icon HashtagU Telugu

Pomegranate: దానిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Pomegranate

Pomegranate

సీజన్ తో సంబంధం లేకుండా మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ పండుని ఇష్టపడని వారు ఉండరు. కొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటే మరికొందరు అలాగే తింటూ ఉంటారు. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దానిమ్మ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాదులకి చెక్ పెట్టడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.

రక్త ప్రసరణ కూడా సాఫీగా సాగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు వారానికి ఒకసారి గ్లాసు దానిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. దానిమ్మపండులో ఫైబర్ అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దానిమ్మ పండు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దానిమ్మ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. బీపీ ఉన్నవారు దానిమ్మపండు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

అంగస్తంభన సమస్యలతో బాధపడే పురుషులకు సరైన ఔషధం అని చెప్పవచ్చు. దానిమ్మ పండు సంతాన సాఫల్యతను పెంచుతుంది. గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది. ఆరోగ్యానికి కాదు అందానికి కూడా ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. మధుమేహ ఉన్న వారు దానిమ్మను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.