Amla winter benefits: చలికాలంలో ఉసిరికాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఉసిరికాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఉసిరికాయ వగరుగా

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 06:30 AM IST

ఉసిరికాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఉసిరికాయ వగరుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే చలికాలంలో ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి చలికాలంలో ఉసిరికాయ తినడం వల్ల ఎటువంటి కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలలో ఉసిరికాయ కూడా ఒకటి. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి.

చలికాలంలో దొరికే అత్యంత ఉత్పాదక పండ్లలో ఉసిరికాయ కూడా ఒకటి. చేదు, పులుపు రుచులతో మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఇందులో ఉంటుంది. కాబట్టి ఉసిరిని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఉసిరికాయను చలికాలంలో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవారికి ఉసిరికాయ ఒక వరం అని చెప్పవచ్చు. ఇది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మధుమేహం ఉన్నవారు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.ఉసిరికాయ మన శరీరంలోని కణాల నష్టాన్ని నియంత్రిస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించే శక్తి కూడా ఉసిరికాయలో ఉంది. ఆ విధంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చలి కాలంలో వచ్చే బాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీరం కోల్పోతుంది. అటువంటి సమయంలో జలుబు, దగ్గు వంటి పై మనపై దాడి చేస్తాయి. ఉసిరికాయను తింటే, మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి, మీరు ఈ వ్యాధుల నుండి చాలా వరకు రక్షించబడతారు.