Site icon HashtagU Telugu

Basil Seeds: తులసి గింజలను స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Basil Seeds

Basil Seeds

భారతదేశంలో తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ తులసి మొక్కకు క్రమం తప్పకుండా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ తులసి మొక్క వల్ల కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఆయుర్వేదంలో తులసి ఆకులను అలాగే తులసి విత్తనాలను ఉపయోగిస్తున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తులసి విత్తనాల వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. మరి తులసి విత్తనాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

తులసి ఆకులు మాత్రమే కాకుండా తులసి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి విత్తనాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నానబెడితే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. కడుపును తొందరగా నింపుతుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. తులసి విత్తనాలలో ఎక్కువ మొత్తం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో చక్కెరల శోషణ మందగించడానికి సహాయపడుతుంది. ఈ విధానం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా నిర్వహించడానికి తులసి విత్తనాలు సహాయపడుతాయని చెబుతున్నారు.

అలాగే తులసి విత్తనాలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని వేడి చేసినప్పుడు, ఎండా కాలంలో హెల్తీ పానీయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రిఫ్రెష్ అనుభూతిని కలిగించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. తులసి విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

అంతేకాదు సెల్యులార్ నష్టాన్ని కూడా నివారిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా తులసి విత్తనాలను నీటిలో నానబెట్టడం వల్ల అవి ఉబ్బుతాయి. శ్లేష్మ ఆకృతిని కలిగి ఉంటాయి. ఇది తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. తులసి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. వీటిని ఉపయోగించడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీరు యవ్వనంగా కనిపిస్తారు. స్కిన్ కలర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి విత్తనాలను ఇక మీదట అస్సలు స్కిప్ చేయకండి.