Site icon HashtagU Telugu

‎HDL: ఈ 5 రకాల ఫుడ్స్ మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని మీకు తెలుసా?

Hdl

Hdl

HDL: ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడడానికి అనేక రకాల కారణాలు ఉండగా వాటిలో ఆహారపు అలవాట్లు కూడా ఒకటి. ఈ ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు కొన్ని చెడు కొలెస్ట్రాల్ ని పెంచితే మరికొన్ని మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయని చెబుతున్నారు. మరి ఇంతకీ మంచి కొలెస్ట్రాలను పెంచే ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటిది అవకాడో.

‎ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఫైబర్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అవకాడో లోని ఆక్సిడెంట్స్ ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయట. అవకాడో నేరుగా తినవచ్చు. బ్లెండ్ చేసుకొని స్మూథీ రూపంలో కూడా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. అలాగే కొవ్వు చేప తరచుగా తీసుకోవడం వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయట. సాల్మన్, సార్డైన్‌, మెకరల్‌ చేపలు తీసుకోవాలని,ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయని, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెబుతున్నారు.

‎వాల్‌నట్స్‌ బాదం వంటివి కూడా డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. వీటిలో మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది కార్డియో ఆరోగ్యానికి మంచిదట. గింజలను స్నాక్ రూపంలో తీసుకోవచ్చని,లేదంటే నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ సాయిలు పెంచడానికి చియా, అవిస గింజలు కూడా కీలకపాత్ర పోషిస్తాయట. ఇందులో ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కార్డియో ఆరోగ్యానికి సహాయపడతాయని, మంచి కొలెస్ట్రాల్ సాయిలు పెంచి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని ఇవి నానబెట్టి లేదా స్మూథీలో కూడా వేసుకుని తినవచ్చని చెబుతున్నారు.

‎ మనదేశంలో ఆలివ్‌ ఆయిల్ తక్కువగా తీసుకుంటారు. కానీ మంచి కొలెస్ట్రాల్ పెంచే గుణం ఈ ఆయిల్ లో ఉంటుంది. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉండే ఆరోగ్యానికి సహాయపడతాయట. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ డైట్లో చేర్చుకోవడం మంచిదని,ఇది చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గించేస్తుందని దీన్ని కుకింగ్ ఆయిల్‌ లా కూడా ఉపయోగించుకోవచ్చని స్ప్రెడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చని అవుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం మంచిదట. ఇందులో బార్లీ, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి కూడా చేర్చుకోవాలట. వీటి వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.

Exit mobile version