Site icon HashtagU Telugu

Nightmares: పీడ కలలు వస్తున్నాయా? మీకు ఆ వ్యాధి ఉన్నట్లే!

Brain Neuro

Brain Neuro

మీకు తరచుగా పీడ కలలు వస్తున్నాయా?

పీడ కలలను తలుచుకొని ఆందోళనకు గురవుతున్నారా?

ఇలాంటి పీడ కలలు ఎందుకు వస్తాయి ? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ బర్మింగ్ హామ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ హెల్త్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. తరచుగా పీడకలలను ఎదుర్కొనే వ్యక్తులు డిమెన్షియా (చిత్త వైకల్యం)తో బాధపడుతున్నారని వైద్య నిపుణులు నిర్ధరించారు.
అల్జీమర్స్ వచ్చే ముందు కొన్ని దశాబ్దాల పాటు చెడు కలలు చాలా తరచుగా రావడం గమనించినట్టు వెల్లడించారు. ఇతర వయసుల వాళ్ళతో పోలిస్తే.. 35 నుంచి 64 ఏళ్ల మధ్యవారు వారానికోసారి పీడకలలను ఎదుర్కొనే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని తెలిపారు. మన కలలు కూడా డిమెన్షియా వ్యాధికి సంకేతాలను చూపిస్తున్నాయని తేలింది.

పీడకలలు .. కారణాలు

* మనిషి అధిక ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు పీడకలలు తరచుగా సంభవిస్తాయి.

* పురుషులతో పోల్చితే మహిళలకు పీడకలలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి.

* నిద్రను REM (వేగవంతమైన కంటి కదలిక) మరియు కంటి కదలిక లేని వాటిగా విభజించారు. REM స్థితిలోనే మనం ఎక్కువగా కలలు కంటున్నాము.

* పీడకలలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒత్తిడి మరియు ఆందోళన ఒకటి. ఒత్తిడి హైపర్రౌసల్కు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ-నిద్ర చక్రానికి అసమతుల్యతను కలిగిస్తుంది.

డిమెన్షియా అంటే ..?

డిమెన్షియా అనేది ఒక నిర్దిష్ట వ్యాధి కాదు. మెమొరీ లాస్, సరైన ఆలోచనలు చేయకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం వంటి సమస్యలను డిమెన్షియాగా పేర్కొంటున్నారు. అల్జీమర్స్ వ్యాధి కూడా చిత్తవైకల్యంలో ఒక భాగం. చిత్తవైకల్యం ఎక్కువగా వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఈ రోజుల్లో చిన్న వయస్సులో కూడా ఈ సమస్య వస్తోంది.

అల్జీమర్స్.. డిమెన్షియా..

అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనివడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీని బారిన పడిన వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటాయి. వ్యాధి సోకాక కొన్ని గంటల క్రితం జరిగిన విషయాలే మర్చిపోవడం, ఏమీ మాట్లాడమో మర్చిపోవడం వంటివి జరుగుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. చివరికి రోజు వారీ తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితులకు చేరుకుంటాడు.  స్వీడన్, చైనాకి చెందిన నిపుణులు కొంతమంది వృద్ధుల్లో నిద్రపోయే టైం ను గమనించారు. రోజూ ఎంతసేపు నిద్రపోతున్నారు అనే సమాచారాన్ని నమోదు చేశారు.
అది చిత్తవైకల్యంతో ముడి పడి ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, సమస్యలని పరిష్కరించే సామర్థ్యం మొదలగువాటిని ఇవి ప్రభావితం చేశాయి. చిత్త వైకల్యం సాధారణ రూపాల్లో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. దీని వల్ల మతిమరుపు వస్తుంది. జ్ఞాపక శక్తి మందగించి ఏ విషయం గుర్తుండదు.

మంచిదేనట..

శరీరానికి తిండి, నిద్ర చాలా అవసరం. ఈ రెండింటిలో ఏది సక్రమంగా లేకపోయినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బరువు నిర్వహణ, రక్త ప్రసరణ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ.. ఇవన్నీ సక్రమంగా జరిగేందుకు నిద్ర ఎంతో అవసరం. మనలో చాలా మందికి సాధారణంగా నిద్ర పోయేటప్పుడు కలలు వస్తూనే ఉంటాయి. ఇలా కలలు రావడం కూడా ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.