మంచి నిద్ర అన్నది చాలా అవసరం. అందుకే వైద్యులు ప్రతిరోజు 8 గంటలపాటు నిద్రపోమని చెబుతూ ఉంటారు. బాగా నిద్రపోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సరిగా నిద్రపోకపోతే ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒత్తిడి టెన్షన్స్ ఇలా అనేక కారణాల వల్ల చాలామంది నిద్రపోవాలి అంటే ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై వైద్యులు స్పందిస్తూ రాత్రిపూట కొన్ని రకాల డ్రింకులు తీసుకోవడం వల్ల కంటి నిండా నిద్రపోవచ్చు అని అంటున్నారు..
మరి ఆ డ్రింకులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..బాదం గింజలు.. నిద్ర క్వాలిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెలటోనిన్ నిద్ర నాణ్యతను మెరుగుపరిచే హార్మోన్. ఇది మెదడులో సెరోటోనిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది నిద్ర త్వరగా పట్టడానికి దోహదపడుతుంది. బాదంలో మెగ్నీషయం సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కెఫిన్ ఉన్న గ్రీన్ టీ శక్తి స్థాయిలను పెంచగలిగినప్పటీకీ, కెఫిన్ లేని గ్రీన్ టీ నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది.
డీకెఫినేటెడ్ గ్రీన్ టీలో థియామిన్ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడే అమైనో యాసిడ్. నిద్రలేమికి ఒత్తిడి ప్రధాన కారణం. చామంతి టీ నిద్రనను ప్రేరేపించడానికి ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో కెఫిన్ ఉండదు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్స్ నిద్రను ప్రేరేపించడానికి, విశ్రాంతిని అందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అదేవిధంగా నిద్రలేమితో బాధపడేవారికి చెర్రీ జ్యూస్ ఔషధంలా పనిచేస్తుంది. చెర్రీస్ శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మెలటోనిన్ నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తుంది చెర్రీ జ్యూస్‌లో మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడే ట్రిప్టోపాన్ ఉంటుంది. పడుకునే ముందు పసుపు పాలు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తుంది.