Site icon HashtagU Telugu

Romance : నెలలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాల్సిందేనట…నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Romance

Romance

ప్రతి రోజూ శృంగారం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి నిపుణులు పదే పదే చెబుతుంటారు. రోజూ కుదరకపోతే నెలకు ఒకసారైనా శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు. మానసిక, శారీరక సంతృప్తి సంతోషానికే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెప్పడం కాదు…ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి వివరించారు.

50 నుంచి 55 ఏళ్ల వయస్సున్న వరకు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈ శృంగారం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. అంతేకాదు మహిళ జీవితంలో కీలకమైన రుతుక్రమం కూడా సరిగ్గా ఉంటుందని నిపుణులు వివరించారు. వీటితోపాటు వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే ఇతర కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉన్న మహిళల్లో రుతుక్రమం, వ్యాధినిరోధక శక్తి వంటి వాటిని పరిశీలిస్తే…తరచుగా శృంగారంలో పాల్గొనే మహిళలే బలంగా ధ్రుఢంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు శృంగారం అనేది కేవలం మానసిక సంతోష సంత్రుప్తికి కాకుండా పలు రకాల ఆనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకుని సురక్షితమైన శృంగారంలో పాల్గొనడం ఉత్తమం.

 

Exit mobile version