Site icon HashtagU Telugu

Singhara : నిరాశావాదాన్ని తరిమేసి.. మానసిక బలమిచ్చే ఫ్రూట్ “సింఘార”

Cropped (3)

Cropped (3)

చలికాలంలో వాడాల్సిన ఫ్రూట్స్ ఎన్నో ఉంటాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాల కోసం శీతాకాలం వేళ మీ డైట్ లో చేర్చుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన ఫ్రూట్ గురించి ఇవాళ తెలుసుకుందాం.దాని పేరే సింఘార పండ్లు. వాటిని ఇంగ్లీష్ లో వాటర్ చెస్ట్ నట్ అని పిలుస్తారు. గుండె ఆకారంలో ఉండే ఈ ఫ్రూట్స్ టేస్ట్ అదుర్స్ అనేలా ఉంటుంది. వాటిలో న్యూట్రీషన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.

పోషకాలు కోకొల్లలు..

* సింఘార పండ్లపై మందపాటి ముదురు ఆకుపచ్చ పొర ఉంటుంది. ఈ పండులో కొవ్వు సున్నా శాతం, 4 గ్రాముల ఫైబర్, 23.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మాంగనీస్, విటమిన్ B6, రిబోఫ్లావిన్, కాపర్ కూడా ఉంటాయి.
* సింఘారలో విటమిన్ B-6 ఉండటం వల్ల ఇది నిద్రపోవడానికి, మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
* చలికాలంలో సింఘార పండ్లు తింటే మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లను ప్రేరేపణ పొందుతాయని నిపుణులు అంటున్నారు. ఫలితంగా మనిషిలోని నిరాశావాదాన్ని తగ్గించడంతో పాటు వ్యక్తి మానసిక స్థితిని బలోపేతం చేస్తుంది. నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పడుతుంది.
* ఒకరకంగా చెప్పాలంటే.. సింఘారా పండు ఒక గొప్ప మూడ్ లిఫ్టర్.
* ఫ్లూ, జలుబు, దగ్గుతో పోరాడే రోగ నిరోధక శక్తిని మన శరీరంలో సింఘారా పెంపొందిస్తుంది.
* కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, పొడి చర్మ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.

గుండెకు ఆరోగ్యం

శీతాకాలంలో ముఖ్యంగా వృద్ధులలో రక్తపోటు రేటు పెరుగుతుంది. సింఘారాలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది మానవ శరీరంలో సోడియం ప్రభావాన్ని తనిఖీ చేస్తుంది. రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి అనుకూలమైన పండుగా, ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెయిట్ లాస్ కోసం..

100 గ్రాముల సింఘారాలో 97 కేలరీల శక్తితో పాటు చాలా తక్కువ కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండు మీ శరీరానికి ఫైబర్, పొటాషియం, మాంగనీస్ అనేక ఇతర ఆరోగ్యకరమైన మినరల్స్ కు గొప్ప మూలం. “సింఘారాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండులో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది చక్కటి డైట్ సప్లిమెంట్ గా ఉంటుంది.

మూత్రాశయ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం..

మన శరీరం చలికాలంలో చాలా వేగంగా నిర్జలీకరణం చెందుతుంది. తద్వారా మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. సింఘారాలో ఉండే “విటమిన్ కె” నీటిని శరీరంలో నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది అనేక ఎంజైమ్‌లు మరియు శుభ్రపరిచే లక్షణాల కారణంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది మూత్రాశయాన్ని శుభ్రపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు

యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతమైనవి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైనవి. సింఘారా మన శరీరం నుంచి టాక్సిన్స్ తొలగింపుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆక్సీకరణ ఒత్తిడితోనూ ఇది పోరాడుతుంది. వివిధ వైరస్లు మరియు బ్యాక్టీరియా వ్యాధుల నుండి కూడా సింఘారా పండ్లు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. సింఘారా పండును పచ్చిగా, వేయించి లేదా ఉడకబెట్టవచ్చు. ఎండిన సింఘారాల నుండి కూడా పిండిని తయారు చేసుకోవచ్చు.