Site icon HashtagU Telugu

Red Wine: రెడ్ వైన్ తాగుతున్నారా.. అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే?

Red Wine

Red Wine

వేసవికాలం మొదలయ్యింది. అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో జనాలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరి దృష్టి కూల్ డ్రింక్స్ పైకి వెళ్తూ ఉంటుంది.అయితే అటు కూల్ డ్రింక్స్ ఇటు మద్యం కాకుండా మద్యస్థంగా ఉండేది రెడ్ వైన్. ఈ రెడ్ వైన్ ని మహిళలు కూడా తాగుతూ ఉంటారు. అయితే ఈ రెడ్ వైన్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు ఉండవని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ రెడ్ వైన్ ని అధిక మోతాదులో తీసుకోవడం వలన క్యాన్సర్, హృదోగంతో పాటు డిప్రెషన్ లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

శుద్ధి చేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్ష రసం తాగడం వలన కాలేయం దెబ్బతింటుంది. అలాగే రెడ్ వైన్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వుశాతం పెరుగుతుంది. తేలింది. రెడ్ వైన్ తాగడం వలన ధీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. అలాగే చర్మం కళను కోల్పోతుంది. రెడ్ వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మొటిమలు చర్మంపై గల మృతకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి. సాధ్యమైనంత వరకూ రెడ్ వైన్ తాగకపోవడమే మంచిది. అలాగే చాలామంది ఈ వేసవికాలంలో బయట దొరికే డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు.

కూల్ డ్రింక్స్ నన్నారి పళ్ళ రసాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం కల్తీవే అని చెప్పవచ్చు. వాటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అయితే బయట మార్కెట్లలో పండ్ల రసాలు చేసినవి అలాగే మిగిలిపోతే మరుసటి రోజు ఉపయోగించడం ఇలాంటివి చేయడం వల్ల వార్డులో చిన్న చిన్న పురుగులు లాంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయడం మంచిది.