మనలో చాలామంది ఆహార పదార్థాలలో ఎక్కువగా కారం వేసుకొని తింటూ ఉంటారు. కూరల్లో ఎక్కువ కారాన్ని వేసుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆకారం దెబ్బకు గొంతులో మంటగా అనిపించడంతోపాటు కొన్ని కొన్ని సార్లు కళ్ళల్లో నీరు కూడా వస్తూ ఉంటాయి. కారం ఎక్కువగా తింటే ఆరోగ్యంగా ఉంటారని స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి అతిగా కారం తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో దీనిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కారం ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.. కారం ఎక్కువగా తినడం వల్ల చాలామందిలో కడుపులో మంట గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరేచనాలు, వాంతులు కూడా కావచ్చని చెబుతున్నారు. అలాగే కారం ఎక్కువగా తింటున్న వారిలో వచ్చే ప్రధాన సమస్యలను అల్సర్ ఒకటి. మోతాదుకు మించి కారం తినడం వల్ల యువతలో కూడా అల్సర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాలో రోజురోజుకు అల్సర్ ప్రమాదం పెరుగుతోందని చెబుతున్నారు. చాలామందిలో అల్సర్ తో పాటు పొట్టలో పుండ్ల వంటి సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు.
కారం ఎంతో ప్రమాదకరమైందని అందరికీ తెలిసిందే అయినప్పటికీ చాలామంది ఆహార పదార్థాల్లో ఎక్కువగా వినియోగిస్తారు నిజానికి కారాన్ని తినడం వల్ల చాలా మందిలో గుండె సమస్యలు కూడా రావచ్చట. కారంలో ఉండే కొన్ని గుణాలు రక్తనాళాలను సంకోచితం చేస్తాయి. దీని కారణంగా రక్తపోటుతో పాటు గుండె సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కారాన్ని తినడం వల్ల కొంతమందిలో కంట్లో నుంచి నీళ్లు రావడం ఆ తర్వాత దురద రావడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలానే జరిగితే కొన్ని నెల తర్వాత కళ్ళు మసకబారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కంటి చూపు నశించిన వారు దీనిని తినడం మానుకోండి.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.