Site icon HashtagU Telugu

Rice Water: అన్నం వండిన తర్వాత గంజి నీరు పారేస్తున్నారా.. జుట్టుకి ఇలా అప్లై చేస్తే కలిగే అస్సలు నమ్మలేరు!

Rice Water

Rice Water

మామూలుగా మనం చేసేటప్పుడు ముందుగా బియ్యాన్ని కలుగుతూ ఉంటావు. ఇలా బియ్యం కడిగిన నీళ్లు ఆరోగ్యానికి అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే అన్నం వండిన తర్వాత వచ్చే గంజి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ గంజిని బియ్యం కడిగిన నీటిని చాలామంది అనేక వాటికోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అన్నం వండిన తర్వాత వచ్చే గంజి జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తే మనకి చెబుతున్నారు. మరి అన్నం గంజితో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, గంజీ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండలు, కాలుష్యం వంటి వాటి వల్ల జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది.

అయితే అలాంటివారు అన్నం గంజిని జుట్టుకు పట్టించడం వల్ల ఇందులో ఉండే ఇనోసిటోల్‌ అనే కార్బోహైడ్రేట్‌ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందట. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు కుదుళ్లను బలంగా మారచడంతో పాటు జుట్టుకి మెరుపుని ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఎండలో ఎక్కువగా తిరిగేవారికి జుట్టు సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు అన్నం గంజిలో కాస్త మజ్జిగ కలిపి తలకు అప్లై చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత గాడత తక్కువ ఉండే షాంపుతో తల స్నానం చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా గంజినీలలో కొంచెం పెసరపిండి కలిపి అందులో కాస్త అర చెక్క నిమ్మరసం కప్పు కలబంద గుజ్జు రెండు చుక్కల బాదం నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల తలలో ఉండే చుండ్రు తో పాటు పేళ్లను కూడా తగ్గిస్తుందట. ఇవి వెంట్రుకలకు పోషణ అందించడంతో పాటు ఆరోగ్యంగా కూడా మారుస్తాయట. రైస్​ వాటర్ లో అమినో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్​ జుట్టుకు చక్కటి పోషణను అందిస్తాయట. కుదుళ్ల నుంచి బలాన్ని చేకూర్చి జుట్టు రాలకుండా కాపాడతాయట. అలాగే కుదుళ్లకు అవసరమైన సహజమైన పీహెచ్ లెవెల్స్​ ను పెంచి జుట్టు పొడి బారకుండా చేస్తాయట. రైస్ వాటర్ తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల పైన చెప్పిన సమస్యలతో పాటు ఇంకా ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.