Site icon HashtagU Telugu

White Hair: తెల్ల వెంట్రుకలు పీకేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

White Hair

White Hair

మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడడం అన్నది సహజం. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం చిన్న వయసు వారికే ఈ తెల్ల జుట్టు సమస్య వస్తోంది. ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ల లోపు పిల్లల నుంచి ఈ సమస్య మొదలవుతోంది. అయితే చాలామంది ఈ తెల్ల జుట్టు కనిపించినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఆ తెల్ల వెంట్రుకలను పీకేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది అలా పీకేస్తే మళ్లీ ఎక్కువ వెంట్రుకలు వస్తాయని అలాగే వదిలేయాలని చెబుతూ ఉంటారు. మరి తెల్ల వెంట్రుకలను పీకేస్తే ఏం జరుగుతుందో, ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టును నల్లగా ఉంచే మెలనిన్, వర్ణద్రవ్యాలు కూడా తగ్గిపోతాయి. ప్రతి హెయిర్ ఫోలికల్ మెలనోసైట్లు అని పిలువబడే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ కణాల కార్యకలాపాలు తగ్గుతాయి. అంటే మెలనిన్ తయారు చేసే పని ఆగిపోతుంది. దాని వల్ల జుట్టు తెల్లబడటం మొదలవుతుంది. జుట్టును లాగడం, లేదా మొత్తమే పీకెయడం వల్ల నెత్తిమీద తీవ్రమైన దురద, చికాకు కలుగుతుంది. అలాగే దద్దుర్లు కూడా ఏర్పడతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. మీరు తెల్ల వెంట్రుకలను పీకేసినప్పుడు నెత్తిమీద విపరీతమైన దురద పెడుతుంది. దీనివల్ల చాలా మంది అక్కడ బాగా గోకుతారు. కానీ నెత్తిమీద పదేపదే గోకడం వల్ల సంక్రమణ ప్రమాదం ఉంది.

అలాగే దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ మొత్తం నెత్తిమీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తెల్ల వెంట్రుకలను పీకేసే అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా వెంట్రుకలను లాగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీని ప్రభావం జుట్టు పెరుగుదల, ఆకృతిపై కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడానికి మీరు వాటిని పీకేయడం మొదలుపెడితే ఆ ప్లేస్ లో కొత్త వెంట్రుకలు పెరిగే అవకాశమే ఉండదు. అంతేకాక తెల్ల వెంట్రుకలను పీకేసిన స్థానంలో నల్ల మచ్చలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం మీ జుట్టు పెరుగుదలపై కనిపిస్తుంది. అంటే మీ జుట్టు పెరిగే ప్రాసెస్ ఆగిపోతుందట. కాబట్టి తెల్ల జుట్టు వస్తే దానిని పీకడానికి అసలు ప్రయత్నించకండి.

note : పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.