Site icon HashtagU Telugu

Hair Care: వేపాకు, కరివేపాకు.. ఈ రెండింటిలో జుట్టుకు ఏది మంచిదో తెలుసా?

Hair Care

Hair Care

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో తెల్ల జుట్టు, పొట్టి జుట్టు, జుట్టు చిట్లి పోవడం, హెయిర్ ఫాల్ ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి వేపాకు, అలాగే కరివేపాకుని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేపాకులను, కరివేపాకులను ఎన్నో సమస్యలను నయం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ రెండు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కరివేపాకు, వేప ఆకులు రెండూ జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాగా కరివేపాకు ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే వేపాకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఈ రెండూ ఆరోగ్యంతో పాటుగా మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
వేపాకుల్లో ఉండే ఔషద లక్షణాలు దెబ్బతిన్న జుట్టును నయం చేయడానికి ఉపయోగపడతాయి.

అయితే కరివేపాకులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టును కాపాడుతాయి. అలాగే ఈ వేపాకులు తలపై రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇకపోతే కరివేపాకు మన జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేపాకుల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును వదిలించుకోవడానికి, నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కరివేపాకు తలకు పోషణనిస్తుంది. పొడి బారడాన్ని తగ్గించి చుండ్రును నివారిస్తుంది. వేపాకుల్లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు మెండుగా ఉంటాయి. అయితే కరివేపాకు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కరివేపాకు సాధారణంగా జుట్టు సహజ రంగును నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అలాగే చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని కూడా నివారించడానికి ఇది సహాయపడుతుంది. ఇకపోతే వేపాకులు వాటి శుద్ధి లక్షణాలతో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టు రంగును నిర్వహించడానికి సహాయపడతాయి. కరివేపాకు వాటి కండిషనింగ్ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఇవి జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తాయి. అలాగే సహజంగా మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. వేపాకుల్లో వాటి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జుట్టును హెల్తీ ఉంచడానికి సహాయపడతాయి.

note : పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.