Healthy Cookwares:ఆరోగ్యంగా ఉండాలంటే…ఎలాంటి పాత్రలు వాడాలి..???

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఉన్నాళ్లు సంతోషంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని అనుకుంటారు.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 02:39 PM IST

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఉన్నాళ్లు సంతోషంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని అనుకుంటారు. కానీ ఇందుకు ఆచరణే కీలకం అన్న సంగతి మరిచిపోతారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం చాలా అవసరం. ఇందుకోసం ఎంపిక చేసుకునే ఆహారం ఎంత ముఖ్యమో…వాటిని ఏ పాత్రల్లో సిద్ధం చేస్తున్నామో అనేది కూడా అంతే ముఖ్యం. పాత్రలు తయారీ సయమంలో హానికరమైన రసాయన కోటింగ్ ను వినియోగిస్తుంటారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగి ఆహారంలోకి వచ్చి చేరుతుంది. అది ఆహారంలోని పోషకాలన్నింటిని నిర్వీర్యం చేసి…ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. రాగి, ఇత్తడి, ఈ రెండూ కూడా ఆహారంలోని పోషకాలకు ఎలాంటి హాని తలపెట్టవు. రాగి ఇంకా మేలు చేస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

ఇత్తడి:
ఇత్తడి అనేది ప్రత్యేకమైన లోహం కాదు. దీనిలో 70 శాతం రాగి ఉంటుంది. మిగిలిన 30శాతం జింక్ ఉంటుంది. ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండుతే కోల్పోయే పోషకాల పరిమాణం కేవలం 7 శాతం ఉంటుంది. కాపర్, జింక్ ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాపర్ లోపిస్తే శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. రక్తహీనత, చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. బియ్యం, పప్పు వంటి అసిడిక్ గుణాలు లేని ఆహార పదార్థాలకే ఇత్తడిని ఉపయోగించడం బెట్టర్ .

కాపర్ :
రాగి పాత్రల్లో నీటి నిల్వ చేయడం వల్ల సహజసిద్ధంగా శుద్ధి అవుతాయి. నీటిని ఎక్కువ రోజుల పాటు స్వచ్చంగా ఉంచుతుంది. మనకు చేటు చేసే నీటిలోని సూక్ష్మ జీవులు ఫంగీ, ఆల్గే, బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కాపర్ కు ఉన్నాయి. దీంతో అకారణంగా వచ్చే ఒంటి నొప్పులకు పరిష్కారంగా రాగి పాత్రల్లో నీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఆహారంలో ఐరన్ ను శరీరం గ్రహించడంలో కాపర్ సాయం చేస్తుంది.

ఐరన్:
మార్కెట్లో లభించే ఐరన్ పెనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నాన్ స్టిక్ పాన్స్ పక్కన పడేసి క్యాస్ట్ ఐరన్ వాడకం చాలా మంచిది. నాన్ స్టిక్ పన్స్ కు వేసే కోటింగ్ అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగి ఆహారంలోకి చేరుతుంది. దీనికి బదులుగా క్యాస్ట్ ఐరన్ వాడటం శరీరానికి కొంత ఐరన్ చేరుతుంది. దీంతో ఐరన్ లోపం కొంతమేర తగ్గిపోతుంది. క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ పాత్రల్లో వాడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నాన్ స్టిక్ తో పోల్చినట్లయితే క్యాస్ట్ ఐరన్ లో ఎలాంటి కోటింగ్ ఉండదు. ఎక్కువరోజులు ఉంటాయి.

కంచు:
దీన్ని కాంస్యం అని అంటారు. టిన్, కాపర్ ల కలయికనే కంచు. ఆహారంలోని అసిడిక్ ను కంచు తగ్గిస్తుంది. జీర్ణాశయం, పేగుల ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఆర్థరైటిస్ రోగుల్లో వాపు తగ్గడానికి సాయపడుతుంది. కాపర్, జింక్ ఇలా ఎన్నో మెటల్స్ తో కంచు తయారువుతుంది ఆహారం సాఫీగా జీర్ణం అయ్యేందుకు కంచు బాగా పనిచేస్తుంది.