ఈరోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆకు ఆ సమస్యకు ఎంతో బాగా పనిచేస్తుందట. ఆ ఆకు మరేదో కాదు గుంటగలగర ఆకు. దీనినే బృంగరాజ్ అని కూడా పిలుస్తారు. దీని ఆకులు, కాండం, పువ్వులు , వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక పురాతన ఆయుర్వేద మూలిక అని చెబుతున్నారు. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జుట్టు మొలవడంలో ఎంతో బాగా పనిచేస్తుందట. గుంటకలగర ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు , పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయట. ఈ ఆకు జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుందట. ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందట. గుంటకలగర ఆకు జుట్టు పెరుగుదలకు ఒక అద్భుతమైన సహజ నివారణగా పని చేస్తుంది.కాగా గుంటకలగర ఆకులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చుండ్రును కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్ తో పోరాడటానికి సహాయపడతాయట. ఈ ఆకు జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి సహాయపడుతుందట. ఇది జుట్టుకు సహజమైన కండీషనర్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. గుంటకలగర ఆకు జుట్టు ఆరోగ్యానికే కాదు కాలేయాన్ని ఉత్తేజపరుస్తుందట. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇది కామెర్లు, హెపటైటిస్ ఇతర కాలేయ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుందట. ఈ ఆకు చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుందట. కాగా ఇది తామర, గజ్జి, సోరియాసిస్, ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుందట. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. ఇకపోతే ఈ ఆకును ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. గుంటకలగర ఆకు పొడిని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలట. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలట. అలాగే గుంటకలగర ఆకు పొడిని పెరుగు లేదా గుడ్డుతో కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలట. ఈ ఆకులను నీటిలో మరిగించి టీ తయారు చేసుకోవచ్చట. ఈ టీని తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందట.