Site icon HashtagU Telugu

Guava Leaves Tea: డయాబెటిస్ సమస్యకు జామ ఆకు టీతో చెక్ పెట్టండిలా?

Guava Leaves Tea

Guava Leaves Tea

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే డయాబెటిస్ వచ్చిన వారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ తో పాటు హోమ్ రెమిడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి జామ ఆకు టీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

మరి జామాకు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామ అనేది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే సహజ ఔషధం. జామ ఆకులు దీనికి మంచి మందు. జామ ఆకులను ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. జామ ఆకు డయాబెటిస్ నివారణకు జామ ఆకులను ఉపయోగిస్తారు. జామ ఆకు టీ తయారు చేయడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి ఆ టీని రోజూ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామఆకు తో టీ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం కొన్ని ఆకులను ఉపయోగించాలి.

ఒక గ్లాసులో 4-5 ఆకులను వేసి కనీసం అరగంట పాటు ఉడికించాలి. తర్వాత మీరు టీని మరిగించి సాధారణ పద్ధతిలో త్రాగడానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. రుచి కోసం చక్కరకు బదులుగా తేనె జోడించవచ్చు. తీపి అవసరం అయితే, తేనెను తక్కువగా కలుపుకోవచ్చు. జామ ఆకు టీని ట్రై చేస్తే ఎలాంటి తీవ్రమైన మధుమేహాన్ని అయినా అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్క జామ ఆకు టీ తాగడం వల్ల మధుమేహాన్ని నయం చేయడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొవ్వును కరిగించడంలో మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.