Site icon HashtagU Telugu

‎Guava Leaves for Diabetes: జామ ఆకులు తింటే మధుమేహం తగ్గుతుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

‎guava Leaves For Diabetes

‎guava Leaves For Diabetes

‎Guava Leaves for Diabetes: మధుమేహం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే మధుమేహం రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆహారపు అలవాట్లు. అలాగే మధుమేహం ఉన్నవారు వైద్యులు సూచించే మందులతో పాటుగా ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. రక్తంలోని చక్కెరను సమతుల్యం చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుందట. చక్కెర స్థాయిలను నియంత్రించగల కొన్ని సహజ ఆహారాలు ఉన్నాయి.

‎వాటిలో జామ ఆకులు ఒకటి. జామ ఆకులు మధుమేహంని తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా జామ ఆకుల టీ ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట. జామ ఆకులను తీసుకోవడానికి సులభమైన మార్గం తాజా ఆకులను నీటిలో మరిగించి టీ లాగా తాగవచ్చట. దీనిని గోరువెచ్చగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.

‎కేవలం జామ ఆకులపై ఆధారపడటం సరికాదట. మందులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడం ఇలా అన్ని విషయాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. జామ ఆకులు మాత్రమే కాకుండా జామకాయలు కూడా షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. నిపుణుల సలహా మేరకు అప్పుడప్పుడు జామ పండ్లు తినడం వల్ల కూడా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు అని చెబుతున్నారు.

Exit mobile version