Site icon HashtagU Telugu

Guava Juice: ఈ రసం తాగితే చాలు దీర్ఘకాలిక వ్యాధులు అన్ని దూరం అవ్వాల్సిందే?

Guava Juice

Guava Juice

జామకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు జామకాయ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్లు కూడా అందుతాయి. జామకాయతో పాటుగా జామకాయ రసం తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు వైద్యులు. జామకాయ రసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందట. అలాగే జీర్ణ క్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలను తలెత్తకుండా చేస్తుందట. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఇవే కాకుండా జామకాయ రసం వల్ల ఇంకా ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. జామకాయ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు జలుబు, ఫ్లూ వంటి అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి కీలక పాత్ర పోషిస్తుందట. జామకాయ రసంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే జామకాయ రసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీంతో పాటు గుండెపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

అలాగే జామకాయ రసంలో తక్కువ కేలరీలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దాంతో మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు. జామకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. అలాగే అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. జామకాయల సందర్శగా తీసుకుంటూ ఉండటం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. జామకాయ రసం డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

note : పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.