Mango : పచ్చి మామిడికాయల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?

మామిడిపండ్లే కాదు పచ్చి మామిడికాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి.

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 08:00 PM IST

Mango : ఎండాకాలం(Summer) అంటేనే మామిడికాయల కాలం. మామిడిపండ్లే కాదు పచ్చి మామిడికాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. పచ్చి మామిడికాయలతో కూడా రకరకాల వంటలు చేస్తారు. మామిడి పప్పు, మామిడి తురుము పచ్చడి, మామిడి పులిహార.. ఇలా అనేక రకాల వంటలు పచ్చి మామిడితో చేసుకొని తింటాము. ఉప్పు కారం రాసుకొని కూడా పచ్చి మామిడి తింటాము. పచ్చి మామిడిలో కూడా అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి.

* పచ్చి మామిడికాయలో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* మన కడుపులో వచ్చే ఎసిడిటీ వంటి సమస్యలను కూడా రాకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
* పచ్చి మామిడికాయలో ఉండే విటమిన్ ఎ కంటికి మేలు చేస్తుంది.
* పచ్చి మామిడికాయలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది.
* పచ్చి మామిడికాయలో ఉండే ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
* పచ్చి మామిడికాయను తినడం వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* పచ్చి మామిడి తినడం వలన అది మన నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
* పచ్చి మామిడి తినడం వలన కాలేయ సమస్యలను రాకుండా చేస్తుంది ఉన్న వాటిని తగ్గిస్తుంది.
* పచ్చి మామిడి తినడం వలన మన చర్మ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇలా పచ్చి మామిడికాయను తినడం వలన మనకు అనేక ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. కానీ పచ్చి మామిడికాయను మితంగా తినాలి లేకపోతే కడుపు తిమ్మిరి వచ్చే అవకాశం ఉంది. మనకు తెలిసినదే కదా ఏదయినా మితంగా ఉంటే ఆరోగ్యం అమితంగా ఉంటే అనారోగ్యం.

 

Also Read : Potato : బంగాళ దుంపతో.. మీ చర్మంపై మచ్చలు బలాదూర్‌..!