Green Coffee Benefits: గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రజలు తరచుగా కాఫీని త్రాగడానికి ఇష్టపడతారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మరో రకం కాఫీ ఉంది. అదే గ్రీన్ కాఫీ (Green Coffee Benefits).

Published By: HashtagU Telugu Desk
Decaf Coffee

Decaf Coffee

Green Coffee Benefits: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రజలు తరచుగా కాఫీని త్రాగడానికి ఇష్టపడతారు. కానీ అధికంగా కాఫీ తాగడం ఆరోగ్యానికి పెద్ద హాని కలిగిస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మరో రకం కాఫీ ఉంది. అదే గ్రీన్ కాఫీ (Green Coffee Benefits). గ్రీన్ కాఫీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కెఫిన్‌కు కొదవే లేదు. మీరు వీలైనంత వరకు గ్రీన్ కాఫీ తాగవచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

గ్రీన్ కాఫీ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తాయి. ఇది తక్కువ పొటాషియం, సోడియంను కలిగి ఉంటుంది. ఇవి అధిక BP రోగులకు ప్రభావవంతంగా పరిగణించబడతాయి.

డయాబెటిక్ రోగులకు మేలు

డయాబెటిక్ రోగులకు గ్రీన్ కాఫీ చాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్‌గా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే గ్రీన్ కాఫీని మీ డైట్‌లో సులభంగా భాగం చేసుకోవచ్చు.

Also Read: Beauty Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా మొటిమలు తగ్గలేదా.. అయితే బంగాళదుంపతో ఇలా చేయాల్సిందే?

శరీరం శక్తిని పొందుతుంది

గ్రీన్ కాఫీని ఎనర్జీ బూస్టర్ అంటారు. మీరు తరచుగా అలసిపోతే గ్రీన్ కాఫీ తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది

కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి గ్రీన్ కాఫీ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రీసెర్చ్ ప్రకారం.. గ్రీన్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ సమస్యను నివారించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

చర్మానికి ప్రయోజనకరం

గ్రీన్ కాఫీలో ఫ్యాటీ యాసిడ్స్, రైజిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి అవసరం.

  Last Updated: 02 Dec 2023, 08:37 PM IST