Green Chiretta Benefits : నేలవేము ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

చిన్న నొప్పి దగ్గరి పెద్ద నొప్పి వరకు ఇలా ప్రతి దానికి మందులు వాడుతూ మన బాడీని మెడిసిన్ కు బానిసను చేస్తున్నాం. కానీ పూర్వం మెడిసిన్ అంటే అస్సలు తెలియని తెలియదు. చెట్ల మూలికలే మెడిసిన్ కంటే బాగా పనిచేసేవి. ఇప్పుడు కూడా చాల ఏరియాల్లో మూలికలనే వాడుతుంటారు.

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 12:42 PM IST

నేలవేము (Green Chiretta) ఇప్పటివారికి చాలామందికి ఇది తెలియదు కానీ.. పల్లెల్లో చాలామంది పెద్దవారికి నేలవేము ..దాని ఉపయోగాలు తెలుసు. అందుకే ఇంగ్లీష్ మందుల కంటే నేలవేమునే ఎక్కువగా నమ్ముతుంటారు. ప్రస్తుతం మెడిసిన్ అనేది మనిషిలో ఓ భాగం అయ్యింది. చిన్న నొప్పి దగ్గరి పెద్ద నొప్పి వరకు ఇలా ప్రతి దానికి మందులు వాడుతూ మన బాడీని మెడిసిన్ కు బానిసను చేస్తున్నాం. కానీ పూర్వం మెడిసిన్ అంటే అస్సలు తెలియని తెలియదు. చెట్ల మూలికలే మెడిసిన్ కంటే బాగా పనిచేసేవి. ఇప్పుడు కూడా చాల ఏరియాల్లో మూలికలనే వాడుతుంటారు.

Green Chiretta Benefits :

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి వాటిలో నేలవేము అనేది చాల ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా చక్కెర వ్యాధిని అరికట్టడంలో నేలవేము బాగా పనిచేస్తుంది. అలాగే కాలేయ వ్యాధులు రాకుండా , వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి నేలవేము ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మూలికలలో ఇది కూడా ఒకటి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు.

అలాగే మరికొన్ని ఉపయోగాలు చూద్దాం.

1. నేలవేము చూర్ణాన్ని తేనెతో కలిపి 1-3 గ్రాములు సేవించిన విష జ్వరాలు తగ్గుతాయి.

2. నేలవేము, తిప్పతీగె, కరాక్కాయ మొదలగు వానిని సమాన భాగాలుగా తీసుకుని రోజూ ఉదయం – సాయంత్రం 2-3 గ్రాముల చొప్పున తేనెతో సేవిస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి.

3. నేలవేము సమూలం, దాచుహరిద్రా 1/2 గ్రా, శొంఠి 1 గ్రా కలిపి కషాయంగా కాచి 30 మి.లీ. ఉదయం – సాయంత్రం సేవించిన కామెర్లు తగ్గుతాయి.

4. నేలవేము కషాయాన్ని 40-50 మి.లీ. ఉదయం – సాయంత్రం సేవిస్తే మంచి స్తవ్యం (పాలు) వృద్ధి చెందుతాయి.

5. నేలవేము మధుమేహంలో కూడ ఉపయుక్తంగా ఉంటుంది. అలానే పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

Read Also : RJD Manifesto: బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా