అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరటి పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అరటి పండ్లను తరచుగా తినమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే మనం ఎక్కువగా బాగా పండిన అరటి పండ్లు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక పచ్చి అరటి పండ్లను కేవలం వంటల తయారీలో చిప్స్ వంటివి తయారీ కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఈ పచ్చి అరటి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరీ పచ్చి అరటి పండు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చి అరటిపండ్లు అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కేవలం పండు మాత్రమే కాకుండా, పచ్చి అరటి తినడం వల్ల లాభాలు ఉన్నాయి. పచ్చి అరటిపండులో అత్యధిక శాతం ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ప్రీబయోటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయట. ఇవి మీ జీర్ణప్రక్రియ, పేగు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆకుపచ్చ అరటి పండ్లు హృదయానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.
పసుపు అరటిపండ్లు వలె, ఆకుపచ్చ అరటిపండ్లు కూడా పొటాషియం కి గొప్ప మూలం. పొటాషియం ఆరోగ్యకరమైన రక్తపోటు సంఖ్యలను నిర్వహించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆకుపచ్చ అరటిపండ్లు తక్కువ తీపి కలిగి ఉంటాయి. పసుపు అరటి కంటే తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. అలాగే పచ్చ అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో, ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. పచ్చి అరటిపండ్లు విటమిన్ సి, బీటా-కెరోటిన్, ఇతర ఫైటో న్యూట్రియెంట్ లతో నిండి ఉంటాయి. ఈ బయోయాక్టివ్ సమ్మేళనాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. పచ్చి అరటి పండు బరువు తగ్గడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట.