Site icon HashtagU Telugu

Green Apple: రెడ్ ఆపిల్స్, గ్రీన్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?

Green Apple

Green Apple

రోజు ఆపిల్ తింటే వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు అని అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, పొటాషియం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. యాపిల్‌ లో ఫైబర్‌ ఎక్కువ గానూ, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. యాపిల్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రావు.

యాపిల్ పండును తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మంది రెడ్‌ యాపిల్స్‌ విచ్చల విడిగా తీసుకుంటూ ఉంటారు. అయితే రెడ్‌ యాపిల్స్‌కి బదులుగా గ్రీన్‌ యాపిల్స్‌ తీసుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. యాపిల్స్ లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

గ్రీన్ యాపిల్స్‌లో క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి గ్రీన్ యాపిల్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా ఎముకలు శక్తి వంతంగా తయారవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ గ్రీన్‌ యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ శక్తివంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈజీగా బరువు తగ్గుతారు.గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అన్ని రకాల వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతుంది.యాపిల్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే కళ్లకు చాలా రకాల మేలు చేస్తుంది. .