Site icon HashtagU Telugu

Ash Gourd : బూడిద గుమ్మడికాయ..దిష్టికే కాదు..సర్వరోగ నివారిణి !

Gray pumpkin..not just a side dish..a cure-all!

Gray pumpkin..not just a side dish..a cure-all!

Ash Gourd : మనకు అందుబాటులో ఉండే గుమ్మడికాయల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. సాధారణ గుమ్మడికాయను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. కానీ బూడిద గుమ్మడికాయను మాత్రం ఎక్కువగా ఇంటి ముందు దిష్టి తీయడానికి, గుమ్మం పైన కట్టడానికి మాత్రమే వాడుతున్నారు. ఇది చాలామందికి తెలిసినదే. కానీ ఈ బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయతో రుచికరమైన వంటకాలు చేయొచ్చు. దీని జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించగలదు. ముఖ్యంగా వేడి కాలంలో దీనిని ఆహారంగా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

తక్కువ క్యాలరీలు – ఎక్కువ లాభాలు

100 గ్రాముల బూడిద గుమ్మడికాయలో సుమారు 96 శాతం నీరు ఉంటుంది. ఇది కేవలం 17 క్యాలరీల శక్తినే ఇస్తుంది. ఇందులో 4 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్‌, 1 గ్రాము ప్రొటీన్లు ఉంటాయి. దీనితోపాటు విటమిన్ C, B1, B2, B3, B5, B6 లు, అలాగే ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

బరువు తగ్గాలంటే ఇది అద్భుతం

బరువు తగ్గాలనుకునే వారు బూడిద గుమ్మడికాయను తమ రోజువారి ఆహారంలో చేర్చాలి. ఇది తక్కువ క్యాలరీలతో ఎక్కువ నీరుగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జ్యూస్‌ తాగితే డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా చూస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా తక్కువగా తినడమవుతుంది. ఇది బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

జీర్ణ వ్యవస్థకు శుభం

బూడిద గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది సహజ ఆల్కలైన్ స్వభావంతో ఉండటంవల్ల శరీరంలోని ఆమ్లతను తగ్గిస్తుంది. ఇది ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాల పెరుగుదల వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

శక్తిని నింపే ఆకృతి

బి విటమిన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచేలా సహాయపడతాయి. అలసట తగ్గుతుంది. ఉదయాన్నే లేచి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీరానికి తడిచిన శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

మానసిక ఆరోగ్యానికి కూడా మేలు

ఈ కాయలు మెదడును ప్రశాంతపరచే గుణం కలిగి ఉంటాయి. బూడిద గుమ్మడికాయను తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు దీన్ని నిత్యం తీసుకుంటే నిద్ర సాఫీగా వస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు, లివర్‌ సహజంగా డిటాక్స్ అవుతాయి.

అందుకే… రోజూ బూడిద గుమ్మడికాయ తినండి

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న బూడిద గుమ్మడికాయను కేవలం దిష్టి కోసం మాత్రమే వాడకూడదు. దీన్ని జ్యూస్‌గా, వంటకంగా తీసుకుంటే శరీరం శక్తివంతంగా మారుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆయుర్వేద నిపుణులు కూడా దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలందించే ఈ గుమ్మడికాయను నిర్లక్ష్యం చేయకుండా మేనూ‌లో చోటు కల్పించండి.

Read Also: Royal Enfield Bikes : మైలేజ్‌పై అపోహలకు ‘గుడ్‌బై’..రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త మోడల్స్‌..ధరలు, వాటి వివరాలు..!