Site icon HashtagU Telugu

Health : డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన టాబ్లెట్స్ ధరలు

Govt Slashes Prices Of 41 M

Govt Slashes Prices Of 41 M

లోక్ సభ ఎన్నికల (Lok Saha Elections) పర్వం కొనసాగుతున్న వేళ కేంద్రం గుండె, కాలేయం, మధుమేహం వంటి సమస్యలతో (sugar, pain, heart, liver, antacid, infection, allergy, multivitamin, and antibiotics) బాధపడుతున్న వారికీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వ్యాధులకు వాడే మందుల ధరలను(medicines rates) భారీగా తగ్గించింది. కేవలం ఈ వ్యాధులకు వాడే మెడిసిన్స్ ధరలు మాత్రమే కాదు సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను సైతం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే ఈ సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఔషదం ధరకు అదనంగా జీఎస్‌టీని మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలలో స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మనదేశంలో మధుమేహ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వీరు టాబ్లెట్స్ ను వాడుతుంటారు. ఇందులో ధనికులతో పాటు మిడిల్ క్లాస్, పేదవారు కూడా ఉన్నారు. ఇలా ప్రతి నెల మందులకే ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఈ క్రమంలో మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకునే డపాగ్లిఫోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ఒకటి ప్రస్తుతం రూ. 30 ఉండగా, అదిప్పుడు రూ. 16కు దిగివచ్చింది. వీటితో పాటు పైన పేర్కొన్న మందుల ధరలన్నీ భారీగా తగ్గుతుండడం తో అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Pooja Hegde : మళ్ళీ సౌత్‌లో అవకాశాలు అందుకుంటున్న బుట్టబొమ్మ.. సూర్య సినిమాలో..!