మఖానాలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది. వేసవిలో కోల్పోయిన శక్తిని తక్షణమే అందించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.. ఈ వేసవిలో శరీరాన్ని ఎనర్జిటిక్ గా చల్లగా ఉంచుకోవడం కోసం అనేక ద్రవపదార్థాలు తీసుకుంటూ ఉంటారు. అయితే సమ్మర్ లో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతూ ఉంటుంది.. చాలామంది ఆహారానికి బదులుగా జ్యూసులు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొందరు పుచ్చకాయ, కర్బూజ కాయల్ని తింటుంటారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
అయితే శరీరాన్ని చల్లబరిచే కొన్ని గింజలు కూడా ఉన్నాయి.
మఖానా వాటిలో ఒకటి. మఖానా శరీరాన్ని చల్లబర్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందట. మఖానాలో పోషకాలు మెండుగా ఉంటాయట. ఇది సులభంగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. ఇది వేసవిలో శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుందట.అలాగే ఇది వేసవిలో కోల్పోయిన శక్తిని తక్షణమే అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మఖానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తారు. ఇది ఒక పోషకమైన, తక్కువ కేలరీల చిరుతిండి అని చెప్పాలి. ఇది బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అంతేకాకుండా మెగ్నిషియం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయట. దీన్ని స్నాక్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండి శరీరం కూడా చల్లగా ఉంటుందట. మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందట. మఖానా తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. దీనివల్ల అదనపు కేలరీల తీసుకోవడం తగ్గుతుందని చెబుతున్నారు. మఖానాలో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుందట. ఇది కండరాలను నిర్మించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందట. ఇది గ్లూటెన్ రహిత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. కాగా రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు రోజూ మఖానా తినవచ్చట. ఇందులో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుందట. ఈ రెండూ కూడా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయట. అధిక రక్తపోటుతో బాధపడేవారు మఖానా క్రమం తప్పకుండా తినాలట. మఖానా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.