సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లో లభించే ఏకైక పండు అరటిపండు. ఈ అరటి పండును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఈ అరటి పండు ని కొంతమంది ఎప్పుడో ఒకసారి తింటే మరి కొందరు మాత్రం తరచుగా తింటూ ఉంటారు. అరటి పండును ఉపయోగించి చాలా రకాల స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. జ్యూస్, స్మూతీలు, స్వీట్స్, షేక్స్ వంటివి తయారు చేస్తారు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే అరటిపండును తరచూ తింటే ఏం జరుగుతుందో,ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందట. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుందట. కాబట్టి రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా మెగ్నీషియం, విటమిన్ బి6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని అని చెబుతున్నారు. అరటిపండు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందట. అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందట. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయట. అలాగే ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలో సహాయపడుతుందట.
అరటిపండు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అరటిపండ్లలో కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయట. దీన్ని తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని, ఎముకల బలం కోసం రోజుకి కనీసం ఒక అరటిపండు తినాలని చెబుతున్నారు. అలాగే అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందట. ఇందులో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందట. సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారికి అరటిపండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. రోజూ అరటిపండు మితంగా తింటే బరువు తగ్గవచ్చట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందట. కేలరీల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందట. అరటిపండులో సహజ తీపి ఉంటుంది. ఇది తినడం వల్ల సహజ తీపి తినాలనే కోరిక ఉండదట. రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయట. అలాగే వ్యాయామానికి ముందు అరటిపండు తినడం మంచిదని చెబుతున్నారు. అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభింస్తుందట. రోజుకి ఒక అరటిపండు తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..