Site icon HashtagU Telugu

Cinnamon Water: రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే?

Mixcollage 22 Jul 2024 05 55 Pm 8586

Mixcollage 22 Jul 2024 05 55 Pm 8586

మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాల్చిన చెక్కను ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతే కాకుండా పూర్వం నుంచి దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దాల్చిన చెక్క నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.

మరి రాత్రిపూట పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాల్చిన చెక్క నీరు మధుమేహం ఉన్నవారికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు రాత్రిలో పడుకునే ముందు దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే ఈ నీరు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. అందుకే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందట.

యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని చెబుతున్నారు. రాత్రి పూట దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే కడుపు ఉబ్బరం కూడా నియంత్రణలోకి వస్తుందట. గ్యాస్ అజీర్ణంతో పాటుగా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క నీరు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకునేవారు దాల్చిన చెక్క నీటిని తాగవచ్చు.