Walk After Eating: భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంటారు. దీని వల్ల కడుపులో కాస్త ఫ్రీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగపడి మనం తీసుకున్న ఆహారం వెంటనే ఆరుగుతుంది. దీని వల్ల కడుపులో ఎలాంటి చెత్త పేరుకుపోదు. అలాగే తిన్న తర్వాత వెంటనే పండుకోవడం ద్వారా పొట్ట రావడంతో పాటు ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే ఆహారం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రి పూట తిన్న తర్వాత వెంటనే బెడ్‌పై పడుకుంటూ ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతున్నారు.
భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయినా వాకింగ్ చేయడం వల్ల జరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం కదలడం ద్వారా కడుపు, పేగలను యాక్టివ్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తిన తర్వాత నడవడం వల్ల పెప్టిక్ అల్సర్లు, గుండెల్లో మంట, మలబద్ధం, కొలోరెక్టర్ క్యాన్సర్ వంటి వ్యాధులు రావని అంటున్నారు. ఇక రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని, టైప్ 1, టైూప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇక నడవడం వల్ల గుండెకు కూడా ఎంతో మంచిదట.
హైపర్ టెన్షన్, చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుదని, దీని వల్ల గుండుపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక భోజనం తర్వాత ఒక పది నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవ్వడంతో పాటు బరువు తగ్గుతారట.