Burger: ఇదేందయ్యా ఇది.. బర్గర్లు ఆరోగ్యానికి చాలా మంచిదట?

ఈ రోజుల్లో యువత ఇంట్లో ఫుడ్ కంటే ఎక్కువగా బయట ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిజ్జాలు,బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లు చిప్స్, కబాబ్, పానీ

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 10:35 PM IST

ఈ రోజుల్లో యువత ఇంట్లో ఫుడ్ కంటే ఎక్కువగా బయట ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిజ్జాలు,బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లు చిప్స్, కబాబ్, పానీ పూరి వంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ , ప్రాసెసింగ్ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ తరం యువతకు వీటి పేర్లు చెప్పగానే నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఏంటి ఇష్టంగా ఆరగించేస్తారు. పిజ్జాలు భర్గర్ లు వంటివి ఎక్కువగా తినవద్దని ఇంట్లో తల్లిదండ్రులు అలాగే వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ పిజ్జాలు బర్గర్లు తినడమే అంటున్నారు కొందరు నిపుణులు..

అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రాసెస్ చేసిన మాంసం, బేకన్, సాసేజ్, సలామీ వంటివి తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తో ముడి పడి ఉన్నాయని వెల్లడించాయి. జంక్ ఫుడ్ అతిగా తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపాయి. ఎవరైతే పండ్లు, మాంసాహారం, చేపలు, గింజలు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి ఆహారం తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు చిన్న వయసులో చనిపోయే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడతాయి.

రోజుకి 85 గ్రాముల రెడ్ మీట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అయితే ఇది తప్పనిసరిగా స్టీక్, చాప్స్ లేదా తాజా బర్గర్ లను తయారు చేయడానికి ఉపయోగించే గొడ్డు మాంసం మాత్రం ప్రాసెస్ చేయనిది అయి ఉండాలి. కొద్ది మొత్తంలో మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమేనని మెక్ మాస్టర్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఆండ్రూ మెంటే చెప్పుకొచ్చారు. అలాగే రెండు సేర్విన్గ్స్ పూర్తి కొవ్వు పాలతో చేసిన బటర్, పాలు, పెరుగు వంటివి తీసుకుంటే కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి పిజ్జాలు బర్గర్లు తినవచ్చు కానీ శృతి మించి తన కూడదు. ముఖ్యంగా బర్గర్లు వంటి వాటిని తినేటప్పుడు ఒకటికీ రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని ఎలా పడితే అలా తింటే మాత్రం సమస్యలు తప్పవు.