Health: జామతో ఆరోగ్యానికి ఎంతో మేలు!

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 06:28 PM IST

Health: విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. అయితే జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాయలో బయటపారేయాల్సింది ఏదీ లేదు. దీనితొక్క, గింజలు కూడా ఆరోగ్యానికి మంచివే. జామకాయలు రెండు రంగుల్లో ఉంటాయి.

కొన్ని జామకాయల్లో లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే.. ఇంకొన్ని జామకాయల్లో గులాబీ రంగులో ఉంటుంది. ఏదేమైనా ఏ రంగు జామకాయను తిన్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మన కళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. జామకాయల్లో ఉండే లైకోపిన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. జామ పండు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైకోపీన్ ఎక్కువగా ఉన్నందున రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను కూడా ఇది నిరోధిస్తుంది. డయాబెటిస్ ఫ్రెండ్లీ ఫ్రూట్.. జామకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.