Carbs : కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కావు…అందులో మంచివీ ఉన్నాయి..అవేంటంటే..!!

అధిక బరువు, షుగర్...ఈ రెండు కూడా ఈ మధ్య అందర్నీ భయపెడుతున్న జీవనశైలి వ్యాధులు. వీటికితోడు హైబీపీ ఇబ్బందిపెడుతోంది. వీటినుంచి బయటపడాలంటే బరువు తగ్గించుకోవాలని, ఆహారం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవాలని...వీలైనంతవరకు కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 06:45 AM IST

అధిక బరువు, షుగర్…ఈ రెండు కూడా ఈ మధ్య అందర్నీ భయపెడుతున్న జీవనశైలి వ్యాధులు. వీటికితోడు హైబీపీ ఇబ్బందిపెడుతోంది. వీటినుంచి బయటపడాలంటే బరువు తగ్గించుకోవాలని, ఆహారం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవాలని…వీలైనంతవరకు కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు. నిజానికి మనం తీనే ఆహారం చాలా భాగం కార్బొహైడ్రేట్లే ఉంటాయి. మరి వాటికి దూరంగా ఉండటం ఎలా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో కార్బొహైడ్రెట్లతో మంచివి , చెడువి రెండు రకాలున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మంచివి తీసుకుంటే…ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు….
కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు….మనకు శక్తినిస్తాయి. వీటిలోప్రొటీన్లు శరీరానికి అత్యవసరంగా కాగా…కార్బొహైడ్రేట్లు, కొవ్వులు కొంత అవసరం. దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఈ మూడు ఉంటాయి. వీటికి అదనంగా పలు కీలక పోషకాలూ ఉంటాయి. అయితే ఫ్యాటీ పదార్థాలకు దూరంగా మనకు సులభం. కానీ కార్బొహైడ్రేట్లలో ఏవి మంచివి, ఏవి చెడ్డవన్న దానిపై చాలామందికి స్పష్టత లేదు. దీనిపై బ్రిటన్ కు చెంది ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు కిర్ స్టెన్ ఆడి పలు సూచనలు చేశారు.

కార్బొహైడ్రేట్లు మూడు రకాలు.
కార్బ్ మొత్తం మూడు రకాలు …ఫైబర్, స్టార్చ్ , చక్కెరలు ఉంటాయని కిర స్టెన్ తెలిపారు.

1. ఫైబర్ స్టార్చ్ రెండూ సంక్షిష్లమైన కార్బొహైడ్రేట్లు. అవి మన శరీరానికి కావాల్సిన శక్తివనరులు అందించడంతోపాటు నాడీ వ్యవస్థ, కండరాలు, ఇతర అవయవాలకు కావాల్సిన పోషకాలనూ కలిగి ఉంటాయని తెలిపారు.

2. చక్కెరలు అతి సాధారణ కార్బొహైడ్రేట్లు. అవి చాలా త్వరగా జీర్ణమై…గ్లూకోజ్ ను వేగంగా రక్తంలోకి రిలీజ్ చేస్తాయి. కానీ వీటిలోకీలక పోషక విలువలు తక్కువని వివరించారు.

3. వీటన్నింటితోపాటు ఫైబర్ ఎక్కువగా, స్టార్చ్ మధ్యస్థంగా, చక్కెరలు అతితక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో మంచి కార్బొహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో చెడు కార్బో హైడ్రేట్లు ఉంటాయనేది వివరించారు.

మంచి కార్బొహైడ్రేట్లు….
1. ఓట్స్,
2. క్వినోవా
3. తొక్కతో సహా ఉండే పండ్లు
4. చిలగడ దుంపలు
5. బీట్ రూట్
6.పెరుగు
7. అరటిపండ్లు
8. క్యారెట్లు
9. గింజలు, విత్తనాలు
10. సంపూర్ణ ధాన్యంతో చేసిన బ్రెడ్
11. బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, సోయాబీన్స్, వేరుశనగ.

చెడు కార్బోహైడ్రేట్లు…
సాధారణ ఆహార పదార్థాలనే బాగా ప్రాసెస్డ్ చేస్తే వాటిల్లోని ఫైబర్ శాతం తగ్గిపోతుంది. విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు తొలగిపోతాయి. స్టార్చ్ అత్యధిక స్థాయిలో చక్కర మిగులుతుంది. అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పాలతో పాటు కొన్ని రకాల పండ్లలోనూ చక్కెరల శాతం ఉంటుంది. కానీ వాటిలోఇతర అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల వాటిని తీసుకోవచ్చు

1. పాలీష్ చేసిన బియ్యం
2. వైడ్ బ్రెడ్
3. పిజ్జా
4. పేస్ట్రీలు
5. తెలుపు పాస్తా
6. బీరు
7. పండ్ల రసాలు
8. కూల్ డ్రింక్
9. చక్కెర కలిపిన సోడా,
10. పాన్ కేక్ లు
11. టొమాటో సాస్
12. డోనట్స్ కేకులు
13 ఫఫ్ లు, బర్గర్లు.

ఇవన్నీ కూడా చెడు కార్బొహైడ్రేట్ల కిందికి వస్తాయి.