గోబీ మంచూరియా.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది దీనిని ఇష్టపడి తింటూ ఉంటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం అయ్యింది అంటే చాలు అలా బయటకు వెళ్ళినప్పుడు గోబీ మంచూరియాని తప్పకుండా తింటూ ఉంటారు. కొందరు క్యాబేజీతో చేసిన గోబీ తింటే మరికొందరు కాలీఫ్లవర్ తో చేసిన గోబీ మంచూరియాని తింటూ ఉంటారు. వర్షాకాలం క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు ఈ గోబీ మంచూరియాని లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు దీనిని తినకుండా ఉంటారు.
ఇందులో రకరకాల పొడులు కలుపుతారని ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అందులోనూ నూనెలో ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తారని అంటూ ఉంటారు. అయితే ఇ గోబీ మంచూరియా కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యుల నిజానికి గోబీ మంచూరియా ఆరోగ్యానికి కలిగించే నష్టం ఏమీ లేదు. కానీ మనకు అది కలర్ ఫుల్ గా కనిపించడానికి అందులో ఉపయోగించే ఫుడ్ కలర్ లోనే అసలు సమస్య మొత్తం మొదలయ్యేది. బయట అమ్మే మంచూరియా చూడటానికి చాలా ఎర్రగా కలర్ ఫుల్ గా ఉంటుంది. వెంటనే మనల్ని ఆకర్షిస్తుంది. కానీ ఆ కలర్ లోన పెద్ద మొత్తంలో క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటాయట.
దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గోబీ మంచూరియ తయారీలో రోడమైన్-బి , టార్ట్రాజైన్ క్యాన్సర్ కారక సంకలితాలను ఉపయోగిస్తుంటారు. అందుకే గోబీ మంచూరియాని కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం నిషేధించింది. ఫుడ్ కలర్ తో పాటు మైదా కార్న్ ఫ్లోర్ వంటివి ఎక్కువ మొత్తంలో వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులోనూ బయట చేసే ఈ గోబీ మంచూరియా వంటివి ఎక్కువ మొత్తం ఆయిల్ ని కలిగి ఉంటాయి. ఇలా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం అసలు మంచిది కాదు. కాబట్టి గోబీ మంచూరియాని తినాలి అనుకున్న వారు చాలా తక్కువగా తినడం మంచిదని చెబుతున్నారు.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది..