Site icon HashtagU Telugu

Periods: అమ్మాయిలూ… పీరియడ్స్ పై ఈ అపోహలు మీరూ నమ్ముతున్నారా..?

Irregular Period

Irregular Period

మనకు చాలా విషయాలపై ఎన్నో అపోహలు ఉంటాయి. అవి అపోహలు అనే సంగతి మనకు తెలియదు. ముఖ్యంగా పీరియడ్స్ పై అమ్మాయిల్లో ఎన్నో అనుమానాలు అపోహలు ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ వచ్చిన సమయంలో వారి తాకకూడదని…దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఇంతవరకు నిజం..ఇందులో ఉన్న అపోహలేంటి…వాస్తవాలేంటి…ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహ: పీరియడ్స్ సమయంలో వచ్చేది చెడు రక్తం..
నిజం:  పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తం చెడు రక్తమని అనుకుంటారు. కానీ పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మనశరీరంలో రక్తమే ఉంటుంది. మంచి, చెడు రక్తం అని రెండు రకాలుగా ఉండదు. రక్తసంబంధ వ్యాధులు ఉన్నవారిలో మాత్రమే రక్తం కలుషితం అవుతుంది. పీరియడ్స్ రక్తం అనేది శరీరంలో ప్రవహించే రక్తమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

అపోహ: పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం సహజం.
నిజం: పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి రావడం అనేది సహజంగా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ మంచి జీవనశైలిని మెయింటైన్ చేసే వాళ్లకు అసలు నొప్పి అనేది రాదు. పీరియడ్స్ వచ్చిపోయింది కూడా తెలిదు. కానీ కొందరికి పీరియడ్స్ వస్తున్నాయంటే..నాలుగు రోజుల నుంచే భయం మొదలవుతుంది. విపరీతమైన నొప్పి వస్తుంది. దీనికి కారణం…వారు ఎక్కువగా జంక్ ఫుడ్, వేడి చేసే ఆహారాలు తీసుకోవడం. లేదంటూ ఇంకేదైనా ఆరోగ్య సమస్య కావచ్చు.

ఈ నొప్పిని వైద్య పరిభాషలో డిస్మెనోరియా అంటారు. పీరియడ్స్ లో నొప్పి రావడం సహజమైన విషయం అస్సలు కాదు. తరచుగా నొప్పి వస్తున్నట్లయితే..తేలికగా తీసుకోకూడదు. ఎండో మెట్రియోసిస్, అడెనో మైయోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అనారోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం కూడా ఉంటుంది.

అపోహ : పీరియడ్స్ వచ్చిన సమయంల నిల్వ ఉండే పదార్థాలు తినకూడదు..
నిజం: పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారమైనా సరే తినవచ్చు. కానీ వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పొట్టనొప్పి రాకుండా ఉంటుంది. ప్రాసెస్డ్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది.

Exit mobile version